ప్రభాస్ సినిమాపై బిగ్ బాస్ విన్నర్ క్లారిటీ: ఒక్క స్టేట్‌మెంట్‌తో పుకార్లకు పుల్‌స్టాప్
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా తన హవాను చూపిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. టాలీవుడ్‌పై ఇన్నేళ్లు వరుస విజయాలతో దండయాత్ర చేసిన అతడు.. ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చారిత్రక చిత్రాల దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్'లో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో డైరెక్టుగా హిందీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీగా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి ఓ విషయంలో క్లారిటీ వచ్చింది.
రజని భరద్వాజ్: చీర వేసినా జీన్స్ వేసినా.. హాట్ గా ఉండాల్సిందే
అత్యంత భారీగా రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీలో హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ విజేత సిద్దార్థ్ శుక్లా నటిస్తున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అతడు ఇందులో కాసేపే కనిపించే మేఘనాథుడి పాత్రలో నటిస్తున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దీనిపై సిద్ధార్ద్ స్పందించాడు. తాజాగా ఓ నేషనల్ మీడియాతో మాట్లాడిన అతడు 'ఆదిపురుష్ మూవీలో నేను నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఇప్పటి వరకూ నన్ను ఎవరూ సంప్రదించలేదు. సో.. అది పూర్తిగా అవాస్తవం' అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.

'ఆదిపురుష్' మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతూ వచ్చింది. కానీ, అంతలోనే కరోనా ప్రభావం భారీగా పెరగడంతో చిత్రీకరణను నిలిపివేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు షూటింగ్‌ను షిఫ్ట్ చేయాలని భావించారు. అంతలో ఇక్కడ కూడా లాక్‌డౌన్ పెట్టడంతో షూట్‌ను తాత్కాలికంగా ఆపేశారు. ఇక, ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. సీతగా కృతీ సనన్, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











