twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ సినిమాలో బిగ్ బాస్ విన్నర్: ‘ఆదిపురుష్’లో కీలక పాత్రలో మిస్టర్ పర్‌ఫెక్ట్.. అతడే ఎందుకంటే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో తన సత్తాను నిరూపించుకుని.. చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. చాలా కాలం పాటు చిన్న చిన్న చిత్రాల్లోనే నటించిన అతడు.. బాహుబలి సిరీస్ తర్వాత నుంచి పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వరుస పెట్టి భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇక, ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో 'ఆదిపురుష్' ఒకటి. పౌరాణిక నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో బిగ్ బాస్ విజేత కీలక పాత్రను పోషిస్తున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరతను? ఆ వివరాలు మీకోసం!

     అక్కడ కూడా ఫేమస్ అయిన ప్రభాస్

    అక్కడ కూడా ఫేమస్ అయిన ప్రభాస్

    కెరీర్ ఆరంభం నుంచి బాహుబలి ముందు వరకూ తెలుగులోనే సినిమాలు చేస్తూ వచ్చాడు ప్రభాస్. దీని నుంచి మాత్రం పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అందుకు కారణం ఉత్తరాదిలోనూ మనోడికి ఫాలోయింగ్ పెరగడమే. ఈ కారణంగానే బాహుబలి అక్కడ బాగా ఆడింది. ఆ తర్వాత వచ్చిన సాహో అయితే అన్ని భాషల్లో నిరాశ పరిచినా.. హిందీలో మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.

    అది అవకముందే మరిన్ని సినిమాలు

    అది అవకముందే మరిన్ని సినిమాలు

    యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాను చేస్తున్నాడు. ఇది షూటింగ్ పూర్తవకు ముందే.. నాగ్ అశ్విన్‌తో ఓ పాన్ వరల్డ్ సినిమాను ప్రకటించాడు. అలాగే, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో 'సలార్' అనే సినిమాను మాత్రం ప్రారంభించేశాడు. దీనితో పాటు ఓ బాలీవుడ్‌ చిత్రంలోనూ చేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు.

     బాలీవుడ్‌లోకి అలా ఎంట్రీ ఇస్తున్నాడు

    బాలీవుడ్‌లోకి అలా ఎంట్రీ ఇస్తున్నాడు

    ప్రభాస్ బాలీవుడ్‌లోని అడుగు పెడుతోన్న చిత్రమే 'ఆదిపురుష్'. చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ రూపొందిస్తోన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో వస్తుంది. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వండర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

     సరికొత్త పాయింట్‌తో ఆదిపురుష్ సిద్ధం

    సరికొత్త పాయింట్‌తో ఆదిపురుష్ సిద్ధం

    'ఆదిపురుష్' సినిమా రామాయణం నాటి కథతో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇది చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో.. రామయాణంలో ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. సీతగా కృతీ సనన్, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను చేస్తున్నాడు.

    అక్కడ నుంచి ఇక్కడకు వస్తున్నారు

    అక్కడ నుంచి ఇక్కడకు వస్తున్నారు

    కొద్ది రోజుల క్రితం 'ఆదిపురుష్' మూవీ షూటింగ్ ముంబై నగరంలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ప్రారంభించారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే, మధ ద్వీపంలో కొద్ది రోజుల పాటు షూటింగ్ చేశారు. ఇప్పటి వరకూ స్టార్లతో 60 రోజుల చిత్రీకరణ జరిగింది. ఈ లోపు కరోనా ప్రభావం భారీగా పెరగడంతో చిత్రీకరణను నిలిపేశారు. కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాద్ వస్తున్నారు.

    ప్రభాస్ సినిమాలో బిగ్ బాస్ విన్నర్

    ప్రభాస్ సినిమాలో బిగ్ బాస్ విన్నర్

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్' సినిమా కోసం ఎంతో మంది ప్రముఖులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. రామాయణం అంటే చాలా పాత్రలు ఉంటాయి కాబట్టి.. పేరున్న వాళ్లనే తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్‌ను తీసుకున్నారని ఓ న్యూస్ లీకైంది.

    కీలక పాత్రలో.. అతడినే ఎందుకంటే!

    కీలక పాత్రలో.. అతడినే ఎందుకంటే!

    హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ విజేత, ప్రముఖ నటుడు సిద్దార్థ్ శుక్లా 'ఆదిపురుష్'లో కీలక పాత్రను పోషిస్తున్నాడట. కాసేపే కనిపించే మేఘనాథుడి పాత్రలోనే అతడు నటిస్తున్నాడని తెలిసింది. కొన్ని డబ్బింగ్ సీరియళ్ల ద్వారా అతడు దక్షిణాది మొత్తానికి పరిచయం అయ్యాడు. అందుకే అతడిని ఈ సినిమాలో భాగం చేయాలని దర్శకుడు భావించి.. ఈ పాత్రకు ఎంపిక చేశాడని సమాచారం.

    English summary
    Prabhas Now doing mythological film Adipurush. In This Movie Bigg Boss Winner Sidharth Shukla to play Key Role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X