సుశాంత్ సోదరి నుంచి మరిన్ని సీక్రెట్స్ బయటకు లాగిన బీహార్ పోలీసులు.. ముంబై పోలీసుల కంటే ఎక్కువే!
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా కూడా ఇంకా అసలు కారణాలు ఏమిటో బయటపడటం లేదు. ఇక ఇప్పుడు ముంబై పోలీసులతో పాటు బీహార్ పోలీసులు కూడా కేసులో అనేక విషయాలపై రీసెర్చ్ చేస్తున్నారు. రీసెంట్ గా బీహార్ పోలీసులు సుశాంత్ సోదరి నుంచి అలాగే అతని దగ్గర పనిచేస్తున్న సర్వెంట్ నుంచి అనేక రకాల కీలక అంశాల గురించి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

ఓ వైపు ముంబై పోలీసులు.. మరో వైపు బీహార్ పోలీసులు
ముందుగా సుశాంత్ సూసైడ్ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కేసు నమోదు చేయగా కేసు మరో మలుపు తిరిగినట్లయ్యింది. అయితే ముంబై పోలీసులు దాదాపు నెల రోజుల పాటు గ్యాప్ లేకుండా నిరంతరం అన్ని వైపుల నుంచి ఆధారాలు సేకరిరించే ప్రయత్నం చేస్తున్నారు.

బీహార్ పోలీసులే ఎక్కువగా..
కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులు, సన్నిహితులను ఎవరిని వదిలిపెట్టకుండా గంటల తరబడి ముంబై పోలీసులు విచారణ చేశారు. అయితే బీహార్ పోలీసులు రెండు రోజుల క్రితమే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఒక విదంగా ముంబై పోలీసుల కంటే కూడా బీహార్ పోలీసులు ఎక్కువ సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.

సుశాంత్ సోదరి నుంచి కీలక సమాచారం
ముఖ్యంగా సుశాంత్ సింగ్ సోదరి మితు సింగ్ ని రీసెంట్ గా కలిసిన బీహార్ పోలీసుకు ఆమెను దాదాపు నాలుగు గంటల పాటు విచారించి సీక్రెట్ అంశాలను సేకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుశాంత్ ఆదాయం గురించి, బ్యాంక్ ఎకౌంట్స్ డీటెయిల్స్ వంటి వివరాలపై కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఎవరికి తెలియని విషయాలు..
అలాగే సుశాంత్ దగ్గర గత కొంత కాలంగా పని చేస్తున్న సర్వెంట్ తో బీహార్ పోలీసులు చాలా సేపు మాట్లాడారు. అయితే ఎక్కువగా సుశాంత్ సోదరి ఇప్పటివరకు ఎవరికి తెలియని విషయాలని చాలా సీరియస్ గా పోలీసుల ముందు ఉంచినట్లు సమాచారం. మితు సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ ని కూడా వారు రికార్డ్ చేసుకున్నారు.

సుశాంత్ మాజీ ప్రేయసిని కూడా..
అదే విధంగా సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే స్టేట్మెంట్ కూడా బీహార్ పోలీసులు రికార్డ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంకిత సుశాంత్ కి బ్రేకప్ చెప్పిన తరువాత కూడా అతని ఫ్యామిలీ మెంబర్స్ తో క్లోజ్ గా ఉంటోంది. ఇక మరో ప్రేయసి రియా చక్రవర్తిని బీహార్ పోలీసులు అన్ని కోణాల్లో విచారించాలని చూస్తున్నారు.
Recommended Video

రియా రివర్స్ కౌంటర్
అయితే రియా బీహార్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోర్టుకి వెళ్లింది. ఇటీవల ఆమె తరపు లాయర్ ఈ విషయంపై స్పందించారు. ఒకే ఘటనకు సంబంధించిన కేసు విషయంలో ఇలా రెండు విధాలా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ కాదని ఆరోపించారు. అదే విధంగా రియా ఎలాంటిదో ప్రజలందరికి తెలుసని ఆమెపై ఆరోపణలు చేయడం కూడా సరైనది కాదని అన్నారు.


Click it and Unblock the Notifications











