మరణానికి ముందు సుశాంత్ నాతో.. బీహార్ పోలీసులకు వంట మనిషి సంచలన విషయాలు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో బీహార్ పోలీసులు వేగం పెంచారు. సుశాంత్ తండ్రి పాట్నాలో ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం కొద్దిరోజుల క్రితం ముంబై చేరుకొన్న పోలీసులు అనుమానితులపై గురిపెట్టారు. ఈ క్రమంలో సుశాంత్ వంట మనిషి నీరజ్‌ను శుక్రవారం విచారించారు. వంట మనిషి విచారణ సందర్భంగా షాకింగ్ విషయాలు బీహార్ పోలీసుల దృష్టికి వచ్చాయి. నీరజ్ వెల్లడించినట్టు మీడియాలో ప్రచారంలో ఉన్న విషయాలు ఏమిటంటే..

రియాతో యూరప్ పర్యటనకు వెళ్లి

రియాతో యూరప్ పర్యటనకు వెళ్లి

హీరోయిన్ రియా చక్రవర్తితో కలిసి సుశాంత్ 2019 అక్టోబర్‌లో విహారయాత్ర కోసం యూరప్ పర్యటనకు వెళ్లారు. యూరప్‌కు వెళ్లే ముందు సుశాంత్ సంపూర్ణ ఆరోగ్యంతో వెళ్లారు. ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు అనారోగ్యంతో వచ్చారు. అప్పటి నుంచి మరణించేంత వరకు సుశాంత్ అనారోగ్యంతోనే ఉండిపోయారు.

పాత నివాసం నుంచి రియా ఇంటికి

పాత నివాసం నుంచి రియా ఇంటికి

యూరప్ నుంచి వచ్చిన తర్వాత సుశాంత్ తన పాత ఇంటి ఖాళీ చేసి రియా చక్రవర్తి ఇంట్లోకి మారారు. ఆ తర్వాత బాంద్రాలోని తన నివాసంలోకి మారారు. ఆ తర్వాత రియా చక్రవర్తి కూడా తనతో ఉండిపోయింది. లాక్‌డౌన్‌లో సిద్ధార్థ్ పితానితో కలిసి సుశాంత్‌తోనే ఉండిపోయారు. అనూహ్య పరిస్థితుల్లో జూన్ 14న ఆయన విగతజీవిగా మారారు అని బీహార్ పోలీసులకు నీరజ్ చెప్పినట్టు తెలిసింది.

జూన్ 14వ తేదీ ఉదయమే నాతో

జూన్ 14వ తేదీ ఉదయమే నాతో

జూన్ 14వ తేదీన జరిగిన విషయాలను పూసగుచ్చినట్టు వంట మనిషి నీరజ్ బీహార్ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఆ రోజు ఉదయం 7 గంటల సమయంలో చల్లటి మంచి నీళ్లు కావాలని అడిగారు. ఆరోగ్య కారణాల రీత్యా చల్లటి నీళ్లు తాగకూడదు. రియా మేడమ్ చల్లటి నీళ్లు ఇవ్వకుండా అడ్డుకొన్నారు. ఆ తర్వాత నార్మల్ వాటర్ ఇస్తే తాగి నవ్వుకుంటూ గదిలోకి వెళ్లారు అని నీరజ్ చెప్పారు.

మధ్యాహ్నం భోజనం కోసం అడిగితే

మధ్యాహ్నం భోజనం కోసం అడిగితే

ఆ తర్వాత కొద్దిసేపటికి సుశాంత్ జ్యూస్ కావాలని అడిగారు. దాంతో ఆయనకు జ్యూస్ ఇస్తే తాగారు. మధ్యాహ్నం భోజనం కోసం ఏం చేయాలని అడిగితే.. స్పందించలేదు. కొద్ది గంటల తర్వాత మళ్లీ తలుపు తడితే సమాధానం రాలేదు. బలవంతంగా డోర్ ఓపెన్ చేస్తే ఉరి వేసుకొని ఉన్నారు అని బీహార్ పోలీసులకు నీరజ్ చెప్పారు.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
పాత వంట మనిషిని కూడా ప్రశ్నించిన బీహార్ పోలీసులు

పాత వంట మనిషిని కూడా ప్రశ్నించిన బీహార్ పోలీసులు

సుశాంత్‌ చుట్టు ఉన్న నమ్మకమైన సిబ్బందిని రియా తొలగించినట్టు అనేక ఆరోపణలు వస్తున్నాయి. సుశాంత్‌ బాగోగుల చూసుకొనే బాడీగార్డు, వంట మనుషులను రియా మార్చి వారి స్థానాల్లో కొత్త వారిని నియమించిందనే వార్తలు ఇటీవల మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో పాత వంట మనిషి అశోక్ కుమార్ ఖాసును కూడా బీహార్ పోలీసులు ప్రశ్నించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X