సుశాంత్ డెత్ మిస్టరీలో అసలు రహస్యం బయటపడే ఛాన్స్.. మారువేశాల్లో పోలీసులు
దేశమంతా సంచలనంగా మారిన సుశాంత్ డెత్ మిస్టరీపై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కూడా సుశాంత్ మృతి పై స్టార్స్ కూడా అనుమానం వ్యక్తం చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. మొదట నెపోటిజం చుట్టూ తిరిగిన వివాదం ఆ తరువాత హఠాత్తుగా రియా చక్రవర్తి వైపుకి మళ్లింది. ఈ కేసు నుంచి బయటపడాలని రియా చాలానే కష్టపడుతోంది. ఇక సాక్షాలు తారుమారయ్యాయి అనే ఆరోపణలతో బీహార్ పోలీసులకు, ముంబై పోలీసుల మధ్య కొంత కోల్డ్ వార్ నడుస్తోంది అనే రూమర్స్ వస్తున్నాయి.

అన్ని కోణాల్లో విచారణ జరిపినప్పటికి..
మొదట సుశాంత్ సూసైడ్ చేసుకోగానే ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. నెలరోజుల పాటు అన్ని కోణాల్లో విచారణ జరిపినప్పటికి వర్కౌట్ కాలేదు. ఇక సాధారణ జనాలు కూడా అనుమానించేలా పోలీసుల విచారణ జరుగుతోందని సుశాంత్ ది ముమ్మాటిగా హత్యే అని రాజకీయ నాయకులు కూడా ఆరోపించారు.

కేసుపై పట్టు సాధించేందుకు
ఇక సుశాంత్ కేసు విషయంలో ముంబై పోలీసుల తీరు కరెక్ట్ గా లేదని సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉన్నట్లు సుశాంత్ తండ్రి బీహార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక FIR నమోదు చేసిన బీహార్ రాష్ట్ర పోలీసులకు ప్రభుత్వం నుంచి కూడా మద్దతు లభించడంతో కేసుపై పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఏ మాత్రం సపోర్ట్ చేయలేదని
అయితే బీహార్ పోలీసులకు ముంబై పోలీసులు కేసు విషయంలో ఏ మాత్రం సపోర్ట్ చేయలేదని వాదనలు వచ్చాయి. ఇక ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్యన కొంత అసంతృప్తి కూడా నెలకొందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే బీహార్ పోలీసులు సొంతంగానే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇష్టపడుతున్నారు.

మారు వేశాల్లో బీహార్ పోలీసులు
ఇక ముంబై పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి కొంత అడ్డుపడుతున్నారని బీహార్ పోలీసులు మారువేశాల్లో వెళ్లి సాక్ష్యాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు అసలు రహస్యాల గుట్టు లాగుతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుమనితులను కూడా సీక్రెట్ గానే విచారిస్తున్నారట. ఈ విషయంలో బీహార్ పోలీసులు ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదని సమాచారం.
Recommended Video

రియా చక్రవర్తి అసంతృప్తి
ఇక మరోవైపు రియా చక్రవర్తి కేసు విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకే కేసును రెండు రాష్ట్రాల పోలీసులు విచారించడం సరికాదని పూర్తిగా కేసును ముంబై పోలీసులకు అప్పగించాలని ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా మీడియాలో తనను దోషిగా చూపిస్తున్నారని కూడా ఇటీవల మరో పిటిషన్ లో రియా పేర్కొంది.


Click it and Unblock the Notifications











