దిశ సలియాన్‌ను రేప్ చేసి మర్డర్.. ఆమె ప్రైవేట్ పార్టులపై తీవ్ర గాయాలు.. సంచలన విషయాలు వెలుగులోకి!

దిశా సలియాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాల వెనుక సంచలన ఆరోపణలు మీడియాలో నమోదు అవుతున్నాయి. ఇప్పుడు ఈ మరణాలపై బీజేపీ, శివసేన మధ్య ఆరోపణలు చోటుచేసుకొంటున్నాయి. ముంబై పోలీసుల దర్యాప్తు అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర సీనియర్ బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణలపై ఆయన కుమారుడు, యువ నేత నితీష్ రాణే స్పందించారు. ఇంతకు నితీష్ రాణే చేసిన ఆరోపణలు ఏమిటంటే..

Recommended Video

Sushant Singh Rajput కు మరణానికి ముందు ఫోన్ చేసిన Disha, జూన్ 13 న ఆ పార్టీలో ఏదో జరిగింది?
దిశ సలియాన్ సూసైడ్ చేసుకోలేదు

దిశ సలియాన్ సూసైడ్ చేసుకోలేదు

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. దిశ సలియాన్‌ను కొందరు రేప్ చేశారు. ఆ తర్వాత ఆమెను దారుణంగా మర్డర్ చేశారు. ఆమెది సూసైడ్ కాదు. దిశ కుటుంబంపై కొందరు తీవ్రమైన ఒత్తిళ్లు, బెదిరింపులు పాల్పడుతున్నారు. అందుకే ఆయన ఆ కుటుంబ దర్యాప్తుకు డిమాండ్ చేయడం లేదు అని రాణే సంచలన ఆరోపణలు చేశారు.

 అందుకే ఫైళ్లు మాయం

అందుకే ఫైళ్లు మాయం

దిశ సలియాన్‌ పోస్టుమార్టం రిపోర్టులో దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. ఆమె ప్రైవేట్ పార్టులపై గాయాలు ఉన్నాయనే విషయం రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు. అందుకే ఆమె కేసును, కేసుకు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. దిశ సలియాన్ మర్డర్‌కు సంబంధించిన పలు రిపోర్టులు మా వద్ద ఉన్నాయి. వాటిని సరైన సమయంలో బయటపెడుతాం అని బీజేపీ నేత నారాయణ రాణే తెలిపారు.

సుశాంత్ ఇంట్లో డినో మారియా ఇంట్లో పార్టీ నిజమే

సుశాంత్ ఇంట్లో డినో మారియా ఇంట్లో పార్టీ నిజమే

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు రోజు ఆయన ఇంటిలో హీరో డినో మారియా తన ఇంటిలో పార్టీ నిర్వహించారు. ఆ పార్టీలో పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత సుశాంత్ ఇంటికి పార్టీ మారింది. ఆ పార్టీలో ఏదో జరిగి ఉంటుందనే అనుమానాన్ని రాణే వ్యక్తం చేశారు. ఆ పార్టీ గురించి పోలీసులు విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి అని రాణే తన ప్రెస్ మీట్‌లో పేర్కొన్నారు.

మా వద్ద కీలక సమాచారం ఉంది

మా వద్ద కీలక సమాచారం ఉంది

తన తండ్రి నారాయణ రాణే చేసిన కామెంట్లపై ఎమ్మెల్యే నితీష్ రాణే టైమ్స్ నౌ ఛానెల్‌లో మాట్లాడుతూ.. ఆయన మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన నిరాధార ఆరోపణలు చేయరు. ఆయన వద్ద కీలకమైన సమాచారం ఉన్న కారణంగానే ఆయన ప్రెస్‌మీట్‌లో సంచలన విషయాలు బయటపెట్టారేమో. మా వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయి. వాటిని తప్పకుండా బయటపెడుతాం అని అన్నారు.

త్వరలోనే విషయాలను బయటపెడుతాం

త్వరలోనే విషయాలను బయటపెడుతాం

జూన్ 13వ తేదీన రాత్రి నటుడు డినో మారియా ఇంటిలో పార్టీ జరిగింది. ఆ తర్వాత అందరూ సుశాంత్ ఇంటికి వెళ్లారు. ఆ విషయం థాకరే కుటుంబానికి సన్నిహితుడైన రాజకీయ నేత చెప్పారు. ఆ పార్టీ విషయం బాలీవుడ్‌లో అందరికి తెలుసు. ఆ విషయాలను త్వరలోనే మేము బయటపెడుతాం అని నితిష్ రాణే చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X