ఆ హీరో మర్డర్ వెనుక సీఎం, ఆయన కొడుకు.. బీజేపీ నేత సంచలన ఆరోపణలు!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లో నిప్పు రాజేసింది. గత కొద్దికాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న సుశాంత్ డెత్ మిస్టరీ మరోసారి అనూహ్యంగా తెరపైకి వచ్చింది. బీజేపీకి చెందిన ఓ నేత తాజాగా ఓ బహిరంగ సభలో తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. బీజేపీ నేత చేసిన ఆరోపణల వివరాల్లోకి వెళితే..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణంపై నెటిజన్లు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దిశా సలియాన్ మరణం తర్వాత 24 గంటల్లోపే సుశాంత్‌ను వదిలి రియా చక్రవర్తి ఎందుకు వెళ్లింది? ఆ తర్వాత సుశాంత్ ఫ్లాట్‌కు వచ్చింది ఎవరు? ఆయన ఇంటిలోని హార్డ్ డిస్క్‌ల నుంచి డేటా ఎవరు కాపీ చేశారు? జూన్ 8, జూన్ 13వ తేదీన జరిగిన పార్టీలో ఎవరు ఉన్నారు? పార్టీకి వెళ్లిన వారిని ఎందుకు ప్రశ్నించలేదు? దిశాను, సుశాంత్‌ను చంపింది ఒకే టీమ్.. వారు ఎక్కడ ఉన్నారు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

BJP Leader Nilesh Rane alleges Maharastra CM and His son behind the Sushant Singh Rajput death

సుశాంత్ మరణం సంభవించి 1343 రోజులకుపైగా అవుతున్నది. ఈ కేసులో అసలు చలనం లేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిశా సలియాన్ మర్డర్ చేసింది ఒకరే. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ఎందుకు నత్తనడకన సాగుతున్నది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక ఎవరి హస్తం ఉందని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల, ఈ క్రమంలో మహారాష్ట్రలో మాజీ సీఎం, ఆయన కుమారుడిపై బీజేపీ నేత నిలేష్ రాణే పరోక్షంగా సంచలన ఆరోపణలు చేశాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిశా సలియాన్ మర్డర్ వెనుక సీఎం కొడుకు ఉన్నాడు. చిన్న గ్రామం నుంచి వచ్చి హీరోగా అయిన అతడిని ఎవరు మట్టుపెట్టారు. ఎందుకు అతడిని టార్గెట్ చేశారు అనే ప్రశ్నల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

BJP Leader Nilesh Rane alleges Maharastra CM and His son behind the Sushant Singh Rajput death

దిశా సలియాన్ హత్యకేసులో దర్యాప్తు అధికారి ఎవరు? సచిన్ వాజే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో దర్యాప్తు అధికారి ఎవరు? సచిన్ వాజే. ముఖేష్ అంబానీకి సంబంధించిన జిలెటిన్ బాంబుల వ్యవహారంలో దర్యాప్తు అధికారి ఎవరు? సచిన్ వాజే. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నబ్ గోస్వామి అక్రమ అరెస్ట్ దర్యాప్తు అధికారి సచిన్ వాజే. అతడినే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టిందో మీకు తెలుసు అంటూ బీజేపీ ఎంపీ నిలేష్ రాణే సంచలన ఆరోపణలు చేశాడు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ హీరో జూన్ 14వ తేదీ, 2020 రోజు ఆకస్మిక మరణించాడు. ఆయన సూసైడ్ చేసుకొని మరణించారనే విషయం సంచలనం రేపింది. ఆ తర్వాత ఆయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుశాంత్ సింగ్ మరణం కేసును సీబీఐ, సుప్రింకోర్టు పరిధిలోకి తీసుకెళ్లారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X