మరణానికి ముందు 100 డయల్.. దిశ సలియాన్ మృతి గురించి ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిశ సలియాన్ మరణాల కేసులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత మూడు నెలలుగా ముంబై పోలీసులు, ఈడీ, సీబీఐ, ఎన్సీబీ లాంటి దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. అయితే ఈ మరణాల వ్యవహారం బీజేపీ, శివసేన మధ్య పచ్చి గట్టివేస్తే భగ్గుమనేలా చేస్తున్నది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా జాతీయ ఛానెల్స్‌తో నితేష్ మాట్లాడుతూ.. తన మరణానికి ముందు ప్రాణభయంతో దిశ సలియాన్ 100 డయల్ చేసింది అని తెలిపారు. అయితే దిశ సలియాన్ కాల్ చేసినా పోలీసులు స్పందించలేరనే అనుమానాలను వ్యక్తం చేశారు. జూన్ 8వ తేదీన దిశ పాల్గొన్న పార్టీ వివాదంగా మారి ఆమె ప్రాణాలను హరించి వేసిందనే విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నది.

BJP leader Nitesh Rane comments Disha Salian death

ఇదిలా ఉండగా, దిశ సలియాన్ 100 డయల్ చేసిన విషయాన్ని మహారాష్ట్ర హోం మంత్రి ముందు మీడియా ప్రస్తావించగా.. ఆయన సమాధానం దాటవేశారు. ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా తప్పించుకోవడం మీడియాలో చర్చనీయాంశమైంది.

జూన్ 8వ తేదీ అర్ధరాత్రి దిశ సలియాన్ ముంబైలోని మల్లాడ్‌లోని 14 అంతస్తుల భవనం నుంచి పడి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఆమె మరణం తర్వాత దాదాపు 48 గంటల అనంతరం దిశ సలియాన్ పోస్టు మార్టమ్ చేయడం వివాదాస్పదమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X