అనుష్కాకు విడాకులు ఇచ్చేసెయ్.. విరాట్ కోల్హీకి బీజేపీ ఎమ్మెల్యే చెత్త సలహా
ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తున్నా తమకేమీ పట్టనట్లు కాంట్రావర్శీలతో కాలాక్షేపం చేయడం కొంతమందికి అలవాటుగా మారింది. తాజాగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇలాంటి వివాదానికే బలిపశువుగా మారింది. ఇంతకూ ఆమె చేసిందేమిటబ్బా అంటే, పాతాల్ లోక్ వంటి హిట్ వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించడమే.
ఇటీవలే ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పై విడుదలైన పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటూ, మంచి రివ్యూలతో, రేటింగ్ లతో దూసుకుపోతోంది. అయితే, సిరీస్ లోని కంటెంట్ కొంత మంది మనోభావాలను దెబ్బతీస్తోందని, ముఖ్యంగా నేపాలీలను ఈ వెబ్ సిరీస్ టార్గెట్ చేసిందని రాజకీయ వర్గాలు విరుచుకుపడుతున్నాయి.

వెబ్ సీరీస్ లో తన ఫొటోతో పాటూ యోగి ఆదిత్యానాథ్ ఫొటోను కూడా మార్ఫింగ్ చేసినందుకు గానూ అనుష్క శర్మపై బీజేబీ ఎమ్మెల్యే నందకిశోర్ ఆమె పై పోలీస్ కేస్ నమోదు చేశారు. అక్కడితో సంతృప్తి పడని నందకిశోర్, ఆమెకు విడాకులు ఇవ్వాల్సిందిగా విరాట్ కోహ్లీకి సూచించాడు. విరాట్ దేశభక్తుడని, అతడు దేశం కోసం ఆడాడని, కాబట్టి, దేశభక్తిలేని అనుష్కను వదిలేయాలని తెగేసి చెప్పాడు. మరి ఎమ్మెల్యేగారి మాటలను విరాట్ ఎంత వరకూ సీరియస్ గా తీసుకుంటాడో చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











