twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క శర్మపై బీజేపీ ఎమ్మెల్యే కేసు.. మరో వివాదంలో పాతాల్ లోక్

    |

    బాలీవుడ్ నటి అనుష్మ శర్మ నిర్మాతగా మారి రూపొందించిన పాతాల్ లోక్ వెబ్‌ సిరీస్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. ఇప్పటికే గుర్ఖా కమ్యునిటీ కన్నెర్రకు గురైన అనుష్క శర్మను మరో కేసు వెంటాడుతున్నది. తన మనోభావాలు దెబ్బ తీశారంటూ అనుష్కపై ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కేసు నమోదు చేయడం బాలీవుడ్‌లోను, రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఇక ఈ ఫిర్యాదు కారణం ఏమిటంటే..

    పాతాల్ లోక్‌కు అనూహ్య స్పందన

    పాతాల్ లోక్‌కు అనూహ్య స్పందన

    బాలీవుడ్‌లో నిర్మాతగా మారి సినిమాలు రూపొందిస్తున్న అనుష్క శర్మ తాజాగా పాతాల్ లోక్ అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. పోలీసు, మీడియా ప్రధాన అంశాలుగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథాంశంతో ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఇటీవల రిలీజైన ఈ వెబ్‌ సిరీస్‌కు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అనుహ్యమైన స్పందన లభిస్తున్నది. విమర్శకులు, సినీ అభిమానుల ప్రశంసలు అందుకొంటున్నది.

    అనుష్క శర్మపై గుర్ఖాల కన్నెర్ర

    అనుష్క శర్మపై గుర్ఖాల కన్నెర్ర

    పాతాల్ లోక్‌కు సానుకూలమైన పరిస్థితులు ఉన్న సమయంలో తమ కమ్యునిటీని కించపరిచే విధంగా సన్నివేశాలను చిత్రీకరించారంటూ భారతీయ గుర్ఖాలు కన్నెర్ర చేశారు. ఆమెపై కేసు నమోదు చేశారు. ఇలా వివాదంతో ముందుకు కొనసాగుతుండగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ గుర్జర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

     బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం

    బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం

    పాతాల్ లోక్ యూనిట్‌పై బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ గుర్జర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతాల్ లోక్ వెబ్ సిరీస్‌లో తన ఫోటోను అనుమతి లేకుండా ఉపయోగించారు. దాంతో తన ప్రతిష్టకు భంగం కలిగించారని, తన మనోభావాలను కించపరిచారంటూ అనుష్క శర్మపై కేసు నమోదు చేశారు. తన ఫోటోనే కాకుండా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటోను కూడా వాడుకొన్నారని ఆరోపించారు.

    Recommended Video

    Director Rahul Ravindra About Winning National Award For Chi La Sow Movie || Filmibeat Telugu
    జాతీయ భద్రతా చట్టం కింద కేసు

    జాతీయ భద్రతా చట్టం కింద కేసు

    అనుష్క శర్మపై ఎమ్మెల్యే గుర్జర్ కారాలు మిరియాలు నూరారు. తాజాగా మత భావనలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై ఆమెపై జాతీయ భ్రదతా చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. . అంతేకాకుండా హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, అవి జాతీ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గుర్జర్లను బందిపోట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    English summary
    BJP MLA Nandkishore Gurjar filed case on Anushka Sharma over Paatal Lok. He alleges that.. his photo was used without his permission. And he demanded that case should be filed against Anushka under National Security Act due to communal imbalance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X