సుశాంత్ సింగ్‌ది హత్యే.. కొత్త అనుమానాలను కలిగిస్తున్న బీజేపీ ఎంపీ కీలక సాక్ష్యాలు
ఎంతో భవిష్యత్తు ఉన్న బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నప్పటికి ఈ విషయంలో అనేక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఘటన స్థలంలో సుశాంత్ ఉరి వేసుకున్నట్లు కనిపించినప్పటికి అది ఆత్మహత్య అని ఎవరు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇక కేసు విషయంలో రెండు రాష్ట్రాల పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి కీలక సాక్షాలను అలాగే అనుమానాలను బయటపెట్టడం హాట్ టాపిక్ గా మారుతోంది.
Recommended Video

సుశాంత్ సింగ్‌ది హత్యే..
సుశాంత్ సింగ్ మృతి చెందినప్పటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నా వారిలో మొదటి వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి. బీజేపీ రాజ్యసభ ఎంపీ ఈ విదంగా కామెంట్ చేస్తుండడంతో విషయం చర్చనీయాంశంగా మారింది. నిజంగా సుశాంత్ మృతి వెనుక ఎదో బలైమైన కారణం ఉండే ఉంటుందని అలాగే అతనిని హత్య కూడా చేసి ఉండవచ్చని అనుమానాలు కలుగుతున్నాయి.

సుబ్రహ్మణ్య స్వామి సాక్ష్యాలు
ఇక రీసెంట్ గా సుబ్రహ్మణ్య స్వామి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ కొన్ని సాక్షాలను బయటపెట్టారు. సుశాంత్ సింగ్ హత్య చేయబడ్డాడు అని అనుమనించడానికి కారణాలు ఇవే అంటూ.. ఒక డాక్యుమెంట్ ని కూడా షేర్ చేశారు. ఆ డాక్యుమెంట్ లో ఉన్న 26 పాయింట్స్ లలో 24పాయింట్స్ ని బట్టి చూస్తే సుశాంత్ ది హత్యే అని ఎవరైనా సరే కచ్చితంగా చెబుతారని అన్నారు.

చనిపోయిన ప్రాంతాన్ని బట్టి చూస్తే..
ఓకేవేళ అతను డిప్రెషన్ వల్ల సూసైడ్ చేసుకొని ఉంటే.. సోషల్ మిడియా ద్వారా అంతకుముందు కచ్చితమైన విషయన్ని ఏదైనా చెప్పి ఉండాలి. అతను చనిపోయిన ప్రాంతాన్ని బట్టి చూస్తే మాత్రం హత్య చేయబడినట్లు అర్ధమవుతోంది. ఒక బట్ట ఉపయోగించి సూసైడ్ చేసుకొని ఉంటాడు అనుకున్నప్పటికి అతని గొంతుపై ఉన్న గుర్తులు అందుకు తగ్గట్లుగా లేవు.

ఎన్నో రకాల అనుమానాలు
సీసీటీవీ అంతరాయం, గది డూప్లికేట్ తాళం మిస్ అయ్యింది. అతని మేనేజర్ దిశా ముందుగానే సూసైడ్ చేసుకోవడం. సిమ్ కార్డ్ మార్చడం. ఆర్థిక సక్షోభం అసలు లేదు. ఇక అతని సర్వెంట్ స్టేట్మెంట్ చేంజ్ చేస్తున్నాడు... ఇలా ఎన్నో రకాల అనుమానాలను సుబ్రహ్మణ్య స్వామి తన డాక్యుమెంట్ లో తెలియజేశారు.

సీబీఐచే విచారణ జరిపించాలి
ఇక ముంబై పోలీసులు సీఆర్‌పీసీని ఫాలో అవుతున్నారా, లేదా అంటూ.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ యొక్క అసహజ మరణంపై దర్యాప్తులో బీహార్ పోలీసులు తీవ్రంగా మాట్లాడితే, సిబిఐ దర్యాప్తుకు ప్రత్యామ్నాయం లేదు, ఎందుకంటే రెండు రాష్ట్రాల పోలీసులు ఒకే నేరాన్ని విడిగా పరిశోధించలేరని అన్నారు. అలాగే కేసును సీబీఐచే విచారణ జరిపించాలని కూడా ఆయన మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రధానికి కూడా ఆయన లేఖ రాశారు.


Click it and Unblock the Notifications











