20ఏళ్ల క్రితం నాటి కేసు: సన్నీ డియోల్, కరిష్మా కపూర్‌పై అభియోగాలు నమోదు

జైపూర్: ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్, నటి కరిష్మా కపూర్‌లపై 20ఏళ్ల క్రితం నమోదైన కేసులో తాజాగా రైల్వే కోర్టు అభియోగాలు నమోదు చేసింది. అనుమతి లేకుండా షూటింగ్ పేరుతో చైన్ లాగి రైలు ఆలస్యానికి కారణమయ్యారంటూ వారిపై ఈ మేరకు అభియోగాలు నమోదయ్యాయి.

రాజస్థాన్‌లోని అజ్మేర్ జిల్లా పులేరా సమీపంలో 1997లో 'భజ్‌రంగ్' సినిమా షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్‌లో సన్నీ డియోల్, కరిష్మా కపూర్ ఇతర నటీనటులు, సిబ్బంది పాల్గొన్నారు.

BJP Sunny Deol, Karisma Kapoor Charged By Railways For Pulling Chain In 1997

కాగా, ఆ సమయంలో సన్నీ డియోల్, కరిష్మా కపూర్, మరో ఇద్దరు వ్యక్తులు ఎలాంటి అనుమతి తీసుకోకుండానే నరేనా రైల్వే స్టేషన్‌లోకి వచ్చి 2413-U అప్‌లింక్ ఎక్స్‌ప్రెస్ చైన్ లాగారని అప్పటి అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ సీతారామన్ మలాకర్ వీరిపై రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ చర్య వల్ల రైలు 25 నిమిషాలు ఆలస్యమై ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని ఫిర్యాదులో తెలిపారు. కాగా, ఈ కేసులో 2009లో రైల్వే కోర్టు.. సన్నీ డియోల్, కరిష్మా కపూర్, తదితరులపై అభియోగాలు నమోదు చేసింది.

ఆ తర్వాత వీరు సెషన్స్ కోర్టును ఆశ్రయించగా.. 2010 ఏప్రిల్ లో సెషన్స్ న్యాయస్థానం ఆ అభియోగాలను కొట్టివేసింది. అయితే తాజాగా, సెప్టెంబర్ 17న రైల్వే కోర్టు మరోసారి సన్నీ, కరిష్మాలపై అభియోగాలు మోపింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది రైల్వే కోర్టు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X