»   » కృష్ణజింక కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌‌కు ఐదేళ్ల జైలు శిక్ష

కృష్ణజింక కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌‌కు ఐదేళ్ల జైలు శిక్ష

Posted By:
Subscribe to Filmibeat Telugu
కృష్ణ జింకల కేసులో నేడే తుది తీర్పు: సల్మాన్ భవితవ్యంపై ఉత్కంఠ?

1998 నాటి కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ దోషిగా తేలారు. ఈ కేసులో దాదాపు 20 ఏళ్ల తర్వాత గురువారం తీర్పు వెలువడింది. ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ జోధ్‌పూర్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. 

కాగా, ఈ కేసులో సల్మాన్ ఖాన్‌తో పాటు విచారణ ఎదుర్కొన్న ఇతర స్టార్లు సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి బింద్రేలను న్యాయం నిర్దోషులుగా ప్రకటించింది. 1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకలను వేటాడారు.  

సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

ఈ కేసులో సల్మాన్ ఖాన్ మీద అటవీ సంరక్షణ చట్టం 9/51 సెక్షన్ల కింద కేసు నమోదయింది. దీని ప్రకారం కనిష్టంగా సంవత్సరం నుండి గరిష్టంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. అయితే సల్మాన్‌కు ఐదేళ్ల శిక్ష పడింది.

నిర్మాతల్లో ఆందోళన

నిర్మాతల్లో ఆందోళన

సల్మాన్ ఖాన్ దోషిగా తేలడంతో నిర్మాతల్లో ఆందోళన నెలకొంది. ఆయన జైలుకు వెళితే సెట్స్ మీద ఉన్న పలు సినిమాలు, టీవీ కార్యక్రమాలు నష్టపోవాల్సి వస్తుంది. నష్టం వందల కోట్లలో ఉంటుందని అంచనా.

రేస్ 3 మూవీ

రేస్ 3 మూవీ

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా ‘రేస్ 3' అనే చిత్రం తెరకెక్కుతోంది. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. బాలీవుడ్లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. సల్మాన్ జైలుకెళితే ఈ సినిమా పరిస్థితి అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది. ఈ చిత్రం వచ్చే ఈద్‌కు విడుదల కావాల్సి ఉంది.

బిగ్ బాస్

బిగ్ బాస్

ఇక హిందీలో సూపర్ పాపులర్ అయిన ‘బిగ్ బాస్' విజయవంతంగా 11 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నరు. ఇటీవలే 11వ సీజన్ పూర్తయింది. త్వరలో 12 సీజన్ మొదలు కావాల్సి ఉంది. సల్మాన్ జైలుకెళితే ఈ షో గందరగోళంగా మారే అవకాశం ఉంది.

English summary
The Jodhpur court on Thursday convicted Bollywood actor Salman Khan in the two-decades-old blackbuck poaching case for killing two of the endangered species. Co accused actors Saif Ali Khan, Sonali Bendre, Tabu and Neelam were given the benefit of the doubt and acquitted. Quantum of punishment will be pronounced later in the day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X