RC16: రామ్ చరణ్ మూవీలో యానిమల్ స్టార్.. ఇది మామూలు కాంబో కాదుగా!
తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్ హీరోలు అందరూ తమ రేంజ్‌ను పెంచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసేస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా మంది పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిపోయారు. అలాగే, ఇద్దరు ముగ్గురు స్టార్లు గ్లోబర్ రేంజ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో రామ్ చరణ్ ఒకడు. ఈ మధ్య వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న అతడు.. ఫుల్ జోష్‌తో సాగిపోతున్నాడు.
ఇప్పటికే రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. దీనిపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇక, ఈ సినిమా పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సనతో చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు.

రామ్ చరణ్ - బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇప్పటికే న్యూస్ లీకైంది. అంతేకాదు, ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. చరణ్.. 'గేమ్ చేంజర్' సినిమాను పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది.
పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో ఎంతో మంది బడా స్టార్లు నటించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, శివ రాజ్‌కుమార్ సహా ఎంతో మందిని ఫైనల్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్‌ను కూడా ఎంపిక చేసుకున్నారని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో అత్యంత కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్‌ను తీసుకున్నారని తెలిసింది. ఇందులో అతడి రోల్ ఎంతో వైవిధ్యంగా ఉంటుందట. ఈ పాత్ర సెకెండాఫ్‌లో వస్తుందని తెలిసింది. ముఖ్యంగా రామ్ చరణ్, బాబీ డియోల్ మధ్య సన్నివేశాలు ఎవరూ ఊహించని విధంగా ప్లాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కలయికలో రాబోయే ఈ సినిమా దాదాపు రూ. 400 కోట్లు బడ్జెట్‌తో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











