2020లో రీమేక్స్.. ఇక్కడ హిట్.. అక్కడ ఫ్లాప్
మన తెలుగు కథలు బాలీవుడ్‌లో వరుసగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే దాదాపు మన కథలన్నీ కూడా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతుంటాయి. అలా రీమేక్‌లతో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి హీరోలకు సూపర్ హిట్స్ కొట్టేశారు. సల్మాన్ ఖాన్‌ను మళ్లీ నిలబెట్టింది మన తెలుగు కథలే. ఇక అక్షయ్ కుమార్ కూడా మన దక్షిణాది కథలను బాగానే ఎంకరేజ్ చేస్తాడు. అలా ఈ ఏడాదిలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా కాంచన సినిమాను రీమేక్ చేశాడు.
అక్షయ్ హీరోగా లక్ష్మీ బాంబ్ అంటూ రాఘవ లారెన్స్ హిందీలో ఈ కాంచనను రీమేక్ చేశాడు. థియేటర్లో విడుదల చేయాలని ఎంతో ప్రయత్నించినా కూడా చివరకు ఓటీటీలోనే రిలీజ్ చేశారు. కానీ ఇది అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. కాంచనలో మిస్ అయిన కామెడీ, ఆ సోల్ లక్ష్మీ సినిమాలో కనిపించలేదని సౌత్ ఆడియెన్స్ అభిప్రాయపడ్డారు. అలా లక్ష్మీ సినిమా బాలీవుడ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక బాలీవుడ్‌లో తెరకెక్కిన మరో రీమేక్ చిత్రం భాగమతి. అనుష్క శెట్టి హీరోయిన్‌గా వచ్చిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం భాగమతి. ఈ మూవీని హిందీలో దుర్గామతిగా రీమేక్ చేశారు. అందులో భూమి ఫెడ్నేకర్ హీరోయిన్‌గా నటించింది. కానీ ఈ సినిమా విమర్శకుల ధాటికి నిలబడలేకపోయింది. ఇది కూడా ఫ్లాపుగానే మిగిలిపోయింది. కానీ జెర్సీ, హిట్ సినిమా రీమేక్‌లు రిలీజ్ అయి ఉంటే.. కచ్చితంగా మంచి ఫలితాలు వచ్చేవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











