Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలీవుడ్ నటి కన్నుమూత.. శ్రీదేవితో కలిసి..
బాలీవుడ్ నటి సుజాత కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని లీలావతి హాస్పిటల్ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆమె ప్రముఖ నటి, గాయని, దర్శకుడు శేఖర్ కపూర్ సుచిత్ర కృష్ణమూర్తికి సోదరి. ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో దివంగత శ్రీదేవికి సోదరిగా సుజాత కుమార్ నటించారు.

నా సోదరి సుజాత కుమార్ ఆదివారం రాత్రి 11.26 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. మనందరి విడిచి మరో లోకానికి వెళ్లిపోయారు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు అని సుచిత్రా కృష్ణమూర్తి ట్వీట్ చేశారు. గత రెండు రోజుల క్రితం నా సోదరి మృత్యువుతో పోరాడుతున్నది. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించండి. ఆమె చావు బతుకుల మధ్య ఉండటం వలన నాకు ఎవరో గుండెల్లో బాకు గుచ్చినట్టు ఫీలవుతున్నాను. ఆమె నాకు సోదరే కాదు. మంచి స్నేహితురాలు. నా డార్లింగ్. అలాంటి నా సోదరికి ఎదురైన పరిస్థితిని చూసి బాధను తట్టుకోలేకపోతున్నాను అని సుచిత్ర ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

హోటల్ కింగ్‌స్టన్, బాంబే టాకింగ్ లాంటి టీవీ సీరియల్స్‌లో సుజాత కుమార్ నటించారు. అనిల్ కపూర్ నటించిన 24లో మేఘన సింఘానియా నటించారు. సినిమాల విషయానికి వస్తే రంజ్నా, సలాం ఏ ఇష్క్, గోరి తేరే ప్యార్ మే, ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రాల్లో నటించారు.