జియా ఖాన్ తల్లిపై సూరజ్ పంచోలి ఫ్యామిలీ ఫిర్యాదు
బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ మరణం వివాదం మరోసారి కోర్టు మెట్లెక్కింది. జియా ఖాన్ మరణం విషయంలో తమ కుటుంబాన్ని ఇంకా టార్గెట్ చేస్తూనే ఉన్నారంటూ సూరజ్ పంచోలి ఫ్యామిలీ సభ్యులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆదిత్య పంచోలి, జరీనా వాహబ్, సనా పంచోలి తాజాగా జియా ఖాన్ తల్లి రుబియా ఖాన్‌పై ఫిర్యాదు చేశారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత తమ కుటుంబంపై జియా ఖాన్ తల్లి రుబియా ఖాన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2011 నుంచి 2015 మధ్యకాలంలో పంచోలిపై ఎలాంటి ఆరోపణలు చేయవద్దని బాంబే హైకోర్టు ఆదేశించింది. అలాంటి ఆదేశాలను తుంగలో తొక్కి రుబియా ఖాన్ అలాంటి ఆరోపణలే చేస్తున్నారు. రకరకాల ప్రెస్‌లో, సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేశారు.

జియా ఖాన్ మరణంపై ముంబై పోలీసులు, సీబీఐని రాజకీయ నేతలు మేనేజ్ చేశారు అంటూ ట్విట్టర్‌లో రుబియా ఖాన్ కామెంట్ చేశారు. ఇలాంటి కామెంట్లు మా కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి కామెంట్లను ఆపివేయాలి అంటూ ఆదిత్య పంచోలి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











