twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రాణాలు పోతున్నాయి, ఇకనైనా మారండి.. మోడీ ప్రభుత్వంపై అనుప‌మ్ ఖేర్ షాకింగ్ కామెంట్స్!

    |

    కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో మరింత బలంగా మారుతున్న విషయం తెలిసిందే. మరణాల సంఖ్య రోజురోజుకు మరింత ఎక్కువవ అవుతోంది. మరోవైపు పాజిటివ్ కేసులతో జనాలు ఆర్థికంగానే కాకుండా ఆకలి చావులను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక గతంలో చాలాసార్లు నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించిన సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈసారి కౌంటర్ ఇచ్చే విధంగా వ్యాఖ్యానించారు.

    కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌ ఏ స్థాయిలో వినాశనం క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అంటూ ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, దేశంలో జ‌రుగుతున్న పరిణామాలకు భారత ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సీనియర్ నటుడు తెలిపారు. దేశానికి ఎంత ఇమేజ్ క్రియేట్ చేస్తే ఏం లాభం అంటూ.. మనుషుల ప్రాణాలు కాపాడడం కంటే మరొక ముఖ్యమైన పని ఉండదని అన్నారు.

    bollywood actor anupam kher about modi government failure

    ఇప్పటికే ఎంతో మంది మరణించారు అంటూ.. ఇప్పటికైనా కనువిప్పు కలిగి ప్రభుత్వం పరిస్థితులను అర్థం చేసుకోవలసిన టైమ్ దగ్గర పడిందని అనుపమ్ ఖేర్ తెలిపారు. కోవిడ్ కారణంగా ప్రతి రోజు నాలుగు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని 4లక్షల పాజిటివ్ కేసులు కూడా నమోదవుతున్నాయని చెప్పారు.

    ఇక ఆరోగ్య సంక్షోభాన్ని చ‌క్క‌దిద్ద‌డంలో లోపం అయితే ముమ్మాటిగా జరిగిందని విమర్శించిన అనుపమ్ ఖేర్.. ఇతర పార్టీలు ఈ విషాద విషయాలను సొంత ప్రయోజనం కోసం ఉపయోగించడం సరికాద‌ని చెప్పారు. వీలైనంత త్వరగా ప్రజల పరిస్థితిపై ఒక అవగాహనకు వచ్చి జనాలను రక్షించాలని వివరణ ఇచ్చారు

    English summary
    It is well known that the corona epidemic is becoming even stronger in the second wave. The number of deaths is increasing day by day. On the other hand people with positive cases are facing not only financial but also starvation deaths. Senior Bollywood actor Anupam Kher, who has praised Narendra Modi's leadership many times in the past, commented that this time it was counter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X