బాలీవుడ్‌లో మరో నటుడు ఆత్మహత్య.. ఉరి వేసుకొని తిరిగి రాని లోకాలకు.. విదేశీ గర్ల్‌ఫ్రెండ్‌తో..
బాలీవుడ్‌లో మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తర్వాత పలువురు హిందీ చిత్రసీమలో, టెలివిజన్ సీరియల్ నటులు సూసైడ్ చేసుకోవడం వివాదాలుగా మారాయి. అలాంటి సంఘటనలు మరిచిపోకముందే నటుడు ఆసీఫ్ బస్రా ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేశాయి. ఆ వివరాల్లోకి వెళ్లితే..

పాతాల్ లోక్ వెబ్ సీరీస్‌లో
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మాతగా మారి రూపొందించిన వివాదాస్పద పాతాళ్ లోక్ వెబ్ సిరీస్‌లో ఆసీఫ్ బస్రా నటించారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా ఆయన పాత్రకు వ్యక్తమైంది. అయితే అనూహ్య పరిస్థితుల్లో తన సొంత పట్టణం ధర్మశాలలో ఆత్మహత్య చేసుకొన్నట్టు తాజాగా వార్తలు వెలువడ్డాయి.

ధర్మశాలలోని అద్దె ఇంటిలో
సన్నిహితులు, కుటుంబ సభ్యులు వెల్లడించిన ప్రకారం.. ఆసీఫ్ బస్రా ధర్మశాలలోని మెక్‌లాడ్జ్‌గంజ్‌లోని ఎఫ్‌సీ గిడాబా రోడ్డులోని తన నివాసంలో మరణించారు. ఓ ప్రైవేట్ హౌస్‌లో ఉరి వేసుకొని మరణించారు. ఫొరెన్సిక్ నిపుణులు, పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. అయితే ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని ఈ ఘటనకు కారణాలను అన్వేషిస్తున్నారు.

విదేశీ గర్ల్‌ఫ్రెండ్‌తో అఫైర్
ఇదిలా ఉండగా, ధర్మశాలలోని మెక్‌లాడ్జ్‌గంజ్‌లోని ఓ అద్దె ఇంటిలో ఆసీఫ్ బస్రా ఐదేళ్లుగా ఉంటున్నారు. గతంలో ఆయనకు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉండేదని సన్నిహితులు వెల్లడించారు. అయితే వారి మధ్య ఎలాంటి సంబంధాలు ప్రస్తుతం ఉన్నాయనే విషయంలో క్లారిటీ లేదనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
Recommended Video

బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో
ఆసీఫ్ బస్రా కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్, హాలీవుడ్‌కు సంబంధించిన పలు చిత్రాల్లో నటించారు. కావో, పే చే, పరాంజియా, బ్లాక్ ఫ్రైడే చిత్రాల్లో నటించారు. ఇటీవల పాతాల్ లోఖ్, వాహ్, హెస్టేజెస్ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపుపొందారు. ఆసీఫ్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించిన తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తంచేశారు.


Click it and Unblock the Notifications











