బాలీవుడ్ అగ్ర నటుడి ఇంట్లో కరోనా విషాదం.. మరొకరి పరిస్థితి విషమం!
బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాద ఘటనలు అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి. ఒక ఘటన గురించి మరువక ముందే మరో విషాదం బాలీవుడ్ తారలను ఊపిరి పీల్చుకొనివ్వడం లేదు.ఇక ఇప్పుడు మరో అగ్ర నటుడి ఇంట్లో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ లో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ యాక్టర్ దిలీప్ కుమార్ తమ్ముడు అస్లాం ఖాన్ (88) తుది శ్వాస విడిచారు.
కరోనావైరస్ సోకడంతో ఆయన కన్నుమూశారు. ముంబైలోని లీలవతి ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స అందుకుంటున్న అస్లాం చావుతో పోరాడి చివరికి తుది శ్వాస విడిచారు. కోవిడ్ -19 పాజిటివ్ అని తెలియగానే ఇటీవల ఆస్పత్రిలో చేరారు. అస్లాం ఖాన్, మరో సోదరుడు ఎహ్సాన్ (90) కూడా ఆగస్టు 16 న ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఇక అస్లాంకు కోవిడ్-19 రాకముందే పలు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యులు టెకీయజేశారు.

డయాబెటిస్, రక్తపోటు తో పాటు గుండె జబ్బులు కూడా ఉండడంతో ఆయనపై కరోనా వైరస్ తీవ్రంగా ప్రభావం చూపించిందాని ఆసుపత్రి అధికారుల తెలియజేశారు. ప్రస్తుతం ఆయన సోదరుడు ఇషాన్ పరిస్థితి కూడా క్రిటికల్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. వయస్సు పైబడడం వలన అవయవాల ఆరోగ్యం క్షిణించిందని ఆ విషయం కొంత ఆందోళన కలిగిస్తోందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఇషాన్ నాన్-ఇన్వాసివ్ వెంటిలేటర్ సపోర్ట్ తోనే శ్వాస తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇక వారి కుటుంబ సభ్యులు పూర్తిగా క్వారంటైన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సెలబ్రెటీస్ అస్లాం ఖాన్ మృతిపట్ల వారి కుటుంబనికి సంతాపం తెలియజేశారు.


Click it and Unblock the Notifications











