twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ అడ్డంగా బుక్కైన కంగన రనౌత్.. క్వీన్‌పై బాలీవుడ్ నటుడి ఆగ్రహం

    |

    బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ మరోసారి కష్టాల్లో పడింది. ఇప్పటికే వివాదాస్పద ట్వీట్లతో కోర్టు వివాదాల్లో చిక్కుకున్న కంగన మరోసారి ట్వీట్ చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై రైతుల నిరసనలకు సంబంధించిన ఓ వీడియోలో ఓ సిక్కు మహిళను చూపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

     కంగన తన ట్వీట్‌లో

    కంగన తన ట్వీట్‌లో

    కంగన తన ట్వీట్‌లో రూ.100లకు ఆశపడి ఓ సిక్కు వృద్ధమహిళ నిరసన తెలిపడానికి వచ్చింది అంటూ కంగన తన ట్వీట్‌తోపాటు ఓ వీడియోను షేర్ చేసింది. వీడియోలో ఉన్న మహిళనే షహీన్ బాగ్‌లో అల్లర్లకు కారణమైన దాది.. బిల్కిస్ బానో. భారతీయ ప్రతిష్టతను పాక్ మీడియా హైజాక్ చేసింది. విదేశీ స్థాయిలో మనపై బురద జల్లడానికి చేసిన ప్రయత్నాలను ఎండగట్టాలి అంటూ కామెంట్ చేసింది.

    సిక్కు వృద్ధురాలిపై వ్యాఖ్యలపై

    సిక్కు వృద్ధురాలిపై వ్యాఖ్యలపై

    సిక్కు వృద్ధురాలిపై కంగన చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు దిల్‌జిత్ దోసాన్హా అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్కిస్ బానో కాదు.. వీడియోలో కనిపిస్తున్నది మహిందర్ కౌర్. మన తల్లులు దేవుళ్లతో సమానం. అలాంటి వారిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశావు. మహిందర్ కౌర్ రైతు. ఆమె రైతుల ఆందోళనలో పాల్గొన్నారు అని దిలిజిత్ పేర్కొన్నారు.

    మీరు సాక్ష్యాలతో నిరూపించండి

    మీరు సాక్ష్యాలతో నిరూపించండి

    దిల్‌జిత్ స్పందిస్తూ..మహిందర్ కౌర్ జీ.. కంగన టీమ్‌కు మీరు సాక్ష్యాలతో నిరూపించండి. కంగన మీరు గుడ్డిగా కామెంట్లు చేయకండి. మీరు ఈ మధ్యలో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇకనైనా సాక్ష్యాలతో కామెంట్ చేయండి అంటూ కంగనపై ఫైర్ అయ్యారు.

    Recommended Video

    Kareena Kapoor Khan Is Upset With Her Fanboy Diljit Dosanjh, Here’s Why! || Filmibeat Telugu
    నేను రైతునే.. కావాలంటే.. వచ్చి చూసుకో

    నేను రైతునే.. కావాలంటే.. వచ్చి చూసుకో

    దిల్‌జిత్ షేర్ చేసిన మహిందర్ కౌర్ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలో .. కంగనకు ఆ వృద్ద మహిళ సవాల్ విసిరారు. నేను రైతునా కాదా? నా పని ఏంటో చూడటానికి మీరు రండి అంటూ ఘాటుగా స్పందించడం కనిపించింది. అయితే దిల్‌జిత్ వ్యాఖ్యలపై కంగన టీమ్ ఎలా స్పందిస్తో వేచి చూడాల్సిందే.

    English summary
    Diljit Dosanjh fires on Kangana Ranaut over contrversial tweet on Sikh Women. Diljit Dosanjh comment on Kangana Ranaut and tweeted that Our mothers are equivalent to god for us. You have stirred up a hornet's nest. Google the Punjabi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X