పెళ్లయిన విషయాన్ని దాచి సీక్రెట్‌గా హీరోయిన్‌తో .. బయటపడ్డ హీరో రాసలీలలు

నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే ఇండియాలో సినిమాకు, సినీతారలకు ఉన్న క్రేజ్ అలాంటిది కాబట్టి. పెళ్లికి ముందు చాలా మందికి లవ్ స్టోరీలు ఉంటాయి. పెళ్లి తర్వాత కూడా కొందరు తమ అనుబంధాన్ని సీక్రెట్‌గా కొనసాగిస్తుంటారు. దీనిని ఎవ్వరూ బయటపెట్టాలని అనుకోరు కూడా. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో తన పెళ్లి, హీరోయిన్‌తో అనుబంధం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎవరో కాదు.. గోవింద.

కపూర్‌లు, చోప్రాలు, ఖాన్‌ త్రయం బాలీవుడ్‌ను ఏలేస్తున్న సమయంలో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్ధానం సంపాదించుకున్నారు గోవింద. యాక్షన్ సినిమాల వైపు కాకుండా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించారు.

Bollywood actor Govinda reveals that he wanted to marry heroine Neelam Kothari

1963 డిసెంబర్ 21న ముంబైలో జన్మించిన గోవిందా అసలు పేరు.. గోవింద్ అరుణ్ అహుజా. సినిమాల్లోకి వచ్చాక తన స్టేజ్ నేమ్‌ను గోవిందగా మార్చుకున్నారు. 1986లో లవ్ 86 మూవీ ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. వినూత్నమైన కథలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. 90లలో షోలా ఔర్ షబ్నమ్, ఆంకెన్, రాజా బాబు, కూలీ నెంబర్ 1. హీరో నెంబర్ 1, దీవానా మస్తానా, దుల్హే రాజా, బడే మియా చోటా మియా, అనారి నెంబర్ 1, జోడీ నెంబర్ 1 వంటి చిత్రాలతో అగ్రహీరోలకు గట్టి పోటీనిచ్చారు.

2000 ప్రారంభం నుంచి గోవింద దూకుడు తగ్గింది. అయినప్పటికీ ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేస్తూ అభిమానులను అలరించారు. 2015లో జీ హిందీలో వచ్చిన డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ సూపర్ మామ్ సీజన్ 2కి జడ్జిగా వ్యవహరించి బుల్లితెరపైనా సత్తా చాటారు. రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చి ఎంపీగా గెలుపొందారు. ఇటీవల ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో గోవింద ఆసుపత్రి పాలై కోలుకున్నారు.

వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే సునీతను 1987లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు గోవింద. వీరిద్దరూ కొన్నేళ్లపాటు డేటింగ్ చేసి తర్వాత ఒక్కటయ్యారు. అయితే అప్పుడప్పుడే స్టార్‌గా ఎదుగుతున్న దశలో నాటి అందాల తార నీలం కొఠారితో గోవింద ప్రేమలో పడ్డారు. వీరిద్దరిది హిట్ పెయిర్ మాత్రమే కాదు, ఆన్‌స్క్రీన్‌లో వీరి కెమెస్ట్రీ కూడా అద్భుతంగా పండింది. ఒకానొక దశలో సునీతతో బంధాన్ని తెంచుకుని నీలంను పెళ్లాడాలని గోవింద భావించినట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూసింది. తన పెళ్లి గురించి నీలం వద్ద కూడా ఆయన దాచారట. తాజాగా స్టార్ డస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీలంతో తన బంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

సునీతతో తనకు రోజూ గొడవ జరిగేదని.. ఆ సమయంలో నేను కోపాన్ని అదుపు చేసుకోలేకపోయేవాడినని గోవింద చెప్పారు. ఓ రోజు తనను వదిలేయమని సునీతని అడిగానని.. కానీ కొద్దిరోజుల తర్వాత సునీత నాకు ఫోన్ చేసి నచ్చజెప్పకపోయుంటే నేను బహుశా నీలంను పెళ్లి చేసుకునేవాడినని గోవింద తెలిపారు. నీలంతో తాను దురుసుగా ప్రవర్తించానని, ఆమెతో నా బంధాన్ని వృత్తిపరమైన ప్రయోజనాలకు ఉపయోగించుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నీలంతో ప్రేమలో పడ్డానని, ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని అంగీకరించిన గోవింద .. సునీత పట్ల తనకున్న నిబద్ధతను వదులుకోలేకపోయానని చెప్పారు. ప్రస్తుతం గోవింద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X