Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
సినిమాలు లేని సమయంలో స్టార్ హీరోకు వంద కోట్ల అపార్ట్ మెంట్.. ఎలా కొన్నాడంటే?
కరోనా వైరస్ కొట్టిన దెబ్బకు ప్రపంచంలోని చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ మళ్ళీ నలభై ఏళ్ల వెనక్కి వెళ్లినట్లు చాలా మంది చెప్పారు. ఇక అందులో భారీగా దెబ్బ తిన్న వాటిలో సినిమా ఇండస్ట్రీలే ఎక్కువగా ఉన్నాయి. సినిమాలు లేక చాలా మంది నటీనటులు టెక్నీషియన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక స్టార్ హీరోలు సైతం రిస్క్ చేయకుండా భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి సినిమాలు సెట్ చేకుంటున్నారు.
లాక్ డౌన్ లో వంద కోట్ల విలువైన ఇల్లు
అయితే ఇలాంటి కష్ట సమయంలో ఒక హీరో మాత్రం వంద కోట్ల విలువైన అపార్టుమెంట్లలో మూడు ఫ్లోర్లను కొనుగోలు చేశాడు. బాలీవుడ్ ఈ న్యూస్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. పైగా ఈ హీరో పెద్దగా సినిమాలు చేసింది కూడా లేదు. అయినప్పటికీ ఒక మంచి ఇంటిని సొంతం చేసుకొని వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచాడు.
అంత ఖర్చు చేయడానికి కారణం
ఆ అపార్టుమెంట్ కి అంతగా ఖర్చు చేయడానికి కారణం ఏమిటంటే.. అది ముంబైలోని అరేబియన్ మహాసముద్రం ఒడ్డున నిర్మిస్తున్నారట. అద్భుతమైన వ్యూవ్ కోసం అంతగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. హృతిక్ చాలా కాలంగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక కొత్త అపార్ట్మెంట్ ను తనకు నచ్చినట్లుగా మార్చుకుంటున్నాడట.
ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటాడంటే..
క్రిష్ సిరీస్, ధూమ్ వంటి సినిమాలతో తన మార్కెట్ ని అమాంతంగా పెంచుకున్న హృతిక్ గత కొన్నేళ్లుగా ఒక సినిమాకు 50కోట్లకు పైగా అందుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఆ మధ్య తగ్గించినప్పటికి వార్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడంతో మళ్ళీ రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు టాక్.
యాడ్స్ తోనే కోట్లు సంపాదిస్తున్న హృతిక్
ఇక ఫైనల్ గా ఈ హీరో వార్ సినిమా తరువాత మరో సినిమాను రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం క్రిష్ 4తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కావడానికి మరో రెండేళ్లు పడుతుంది. అయితే ఈ లాక్ డౌన్ లో యాడ్స్ ద్వారానే కోట్ల ఆదాయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక సుస్సాన్నే అనే ఫ్యాషన్ డిజైనర్ ను 2000వ సంవత్సరంలో లో పెళ్లి చేసుకున్న హృతిక్ రోషన్ 2014లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇక ఇద్దరి పిల్లల కోసం ఈ హీరో ఇంకా ఆమెతో ఫ్రెండ్లిగా ఉంటున్నాడు.