బ్రేకింగ్: ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం విషమం.. ఆస్పత్రిలో చేరిక.. తల్లి మరణించిన మరసటి రోజే

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన అనారోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే ఇర్ఫాన్ ఆరోగ్యం గురించిన సమాచారం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కాగా, ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయిదా ఆదివారం ఉదయం జైపూర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇర్ఫాన్ ఖాన్ హాస్పిటల్‌లో చేరడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. వివరాల్లోకి వెళితే. .

తల్లి అంత్యక్రియలకు దూరంగా

తల్లి అంత్యక్రియలకు దూరంగా

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ పరిస్థితులు ఇర్ఫాన్ ఖాన్‌ను మరింత కుంగదీశాయి. ఆదివారం మరణించిన తన తల్లి అంత్యక్రియలకు కూడా హాజరుకాకపోవడం మరింత విషాదంగా మారింది. వీడియో కాలింగ్ ద్వారా తల్లి అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు. తన తల్లి మరణించిన విషాదంలో ఇర్ఫాన్ ఆరోగ్యం మరింత క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

రెండేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధికి గురై

రెండేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధికి గురై


గత రెండేళ్ల క్రితం ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. న్యూరోఎండోక్రైన్ ట్యూమర్‌తో బాధపడుతుండటంతో ఆయన లండన్‌లోని ప్రముఖ హాస్పిటల్ చికిత్స పొందారు. కొన్ని నెలల చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు.

అంగ్రేజీ మీడియంతో మళ్లీ

అంగ్రేజీ మీడియంతో మళ్లీ

తాజాగా ఇర్ఫాన్ ఖాన్ నటించిన అంగ్రేజీ మీడియం చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే కరోనావైరస్ ముప్పుతో లాక్‌డౌన్ ప్రకటించడంతో థియేటర్ల నుంచి సినిమాను ఎత్తేశారు. తాజాగా డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో వరల్డ్ ప్రీమియర్‌ను ప్రదర్శించారు. ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కిన విషయం తెలిసిందే.

Recommended Video

Irrfan Khan Treatment Going Well, Recently Spotted At Mumbai Airport || Filmibeat Telugu
ఇర్ఫాన్ కెరీర్, ఫ్రొఫెషనల్ లైఫ్

ఇర్ఫాన్ కెరీర్, ఫ్రొఫెషనల్ లైఫ్

ఇర్ఫాన్‌ ఖాన్‌కు భార్య సుతాపా సిక్దర్, బాబిల్, ఆయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరిన ఆయనకు తోడుగా హాస్పిటల్‌లోనే ఉన్నారు. జైపూర్‌లోని టోంక్ నవాబు వంశానికి చెందిన ఇర్ఫాన్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ పొందారు. ఆ తర్వాత చాణక్య, బనేగి అప్నీ బాత్, భారత్ ఏక్ కోజ్,చంద్రకాంత లాంటి టెలివిజన్ సీరియల్స్‌లో నటించారు. ఆ తర్వాత సలాం బాంబే, మక్బూల్, లైఫ్ ఇన్ ఏ మెట్రో, పాన్ సింగ్ తోమార్, పీకూ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X