32 ఏళ్ల బ్యూటీతో 60 ఏళ్ల హీరో సరసాలు.. స్విమ్మింగ్‌పూల్‌లో లిప్‌లాక్స్‌తో తడిసి ముద్దైన జంట!
గ్లామర్ ఫీల్డ్ అయిన చిత్ర పరిశ్రమలో ఏమీ లేకుంటేనే ఏదో ఉదని రాసేస్తారు పుకారు రాయుళ్లు. అలాంటిది ఓ బాలీవుడ్ హీరో తన ఎఫైర్లు, బ్రేకప్స్, పెళ్లిళ్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. లేటు వయసులోనూ ఘాటు యవ్వారాలు నడపటంలో మనోడు సిద్ధహస్తుడు. ఇప్పటికే పెళ్లయిన ఆ హీరో .. ఏకంగా తన కంటే దాదాపు 25 ఏళ్ల చిన్నదైన అమ్మాయిని పెళ్లాడి ఆమెతో సరసాలాడుతూ దొరికిపోయాడు. ఈ వివరాల్లోకి వెళితే :
సాధారణంగా పెద్దలు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయికి , అమ్మాయికి మ్యాగ్జిమమ్ ఏజ్ గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఏకంగా తన వయసులో సగం వయసున్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం అరుదుగా కనిపించే వ్యవహారం. కానీ కొందరు సినీ నటులు మాత్రం ఏజ్‌తో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. అది కూడా మహా అయితే 10, 15 ఏళ్లకు మించి ఉండేది కాదు. కానీ బాలీవుడ్ నటుడు , మోడల్ మిలిండ్ సోమన్ మాత్రం ఏకంగా తన కంటే వయసులో పాతికేళ్ల చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెతో హ్యాపీగా కాపురం కూడా చేసేస్తున్నాడు.

మిలింద్ సోమన్ తన పర్సనల్ లైఫ్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. అతని కెరీర్‌లో చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్స్, రిలేషన్స్ ఉండటంతో పాటు చాలా మందిని పెళ్లిళ్లు చేసుకున్నాడని బాలీవుడ్ టాక్. తొలుత ఫ్రెంచ్ నటి మైలిన్ జంపానోయిని పెళ్లాడాడు మిలింద్. అప్పటికి ఆమె అతని కంటే 15 ఏళ్లు చిన్నది . వీరిద్దరూ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ సెట్‌లో జరిగిన పరిచయంతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన రెండేళ్లకే మనస్పర్ధలు రావడంతో మిలింద్ - మైలిన్‌లు 2009లో విడాకులు తీసుకున్నారు.
ఆమె నుంచి విడిపోయిన తర్వాత మిలింద్ సోమన్ చాలా మంది టాప్ మోడల్స్, హీరోయిన్లతో డేటింగ్ చేశాడు. వీరిలో మధు సప్రే, షహానా గోస్వామి, దీపానిత శర్మ, గుల్ పనాగ్ తదితరులు ఉన్నారు. ఈ క్రమంలో 2018లో అంకితా కున్వర్‌ను మిలింద్ పెళ్లాడి చిత్ర సీమకు షాకిచ్చారు. కారణంగా పెళ్లి సమయానికి ఆమె వయసు కేవలం 26 ఏళ్లే. అంటే మిలింద్ వయసులో దాదాపు సగం చిన్నది. ఈమెతో సోమన్ ఎన్నాళ్లు కలిసుంటాడోనని అంతా భావించారు.. కానీ పెళ్లయి దాదాపు ఆరేళ్లు గడుస్తున్నప్పటికీ ఈ జంట హ్యాపీగానే లైఫ్ లీడ్ చేస్తోంది.
పెళ్లికి ముందు అంకిత క్యాబిన్ క్రూలో పనిచేసేది. మిలింద్‌తో మ్యారేజ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆమె ఉద్యోగాన్ని వదిలేసింది. మిలింద్ - అంకితలు తరచుగా ట్రావెలింగ్, ఫిట్‌నెస్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా స్విమ్మింగ్‌పూల్‌లో, బీచ్‌లో జలకాలు ఆడిన ఫోటోలను ఈ జంట షేర్ చేసింది. ఇందులో భార్యాభర్తలిద్దరూ లిప్‌లాక్‌లో తడిసిముద్ధయి పోతున్నారు. ఇవి కాస్త ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో ఆయన ఇప్పుడే ఇలా ఉన్నాడంటే అప్పట్లో ఎలా ఉండేవాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











