twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ నటుడికి జైలుశిక్ష.. తీహార్ జైలుకు తరలింపు

    |

    బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తీసుకొన్న అప్పును తిరిగి చెల్లించనందుకు గాను నటుడు జైలుపాలయ్యాడు. రుణదాత ఫిర్యాదు చేయడంతో ఈ కేసును ఢిల్లీ కోర్టు విచారించింది. విచారణ అనంతరం రాజ్ పాల్ యాదవ్‌ను పోలీస్ కస్టడికి అప్పగిస్తూ జస్టిస్ రాజీవ్ సాహాయ్ ఎండ్లా తీర్పునిచ్చారు. రాజ్‌పాల్ యాదవ్‌ను తీహార్ జైలులో ఉంచాలని తీర్పులో పేర్కొనడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

    సినిమా నిర్మాణం కోసం

    సినిమా నిర్మాణం కోసం

    సినిమా నిర్మాణం కోసం నటుడు రాజ్‌పాల్ యాదవ్, మురళీ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ అధినేత ఎంజీ అగర్వాల్‌తో మధ్య ఒప్పందం జరిగింది. ఒప్పందంలో భాగంగా సినిమా రూపకల్పన కోసం రూ.5 కోట్ల రుణాన్ని యాదవ్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత ఆట పాట లపాట అనే సినిమాను 2012లో నిర్మించాడు. బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది.

    సినిమా ఫ్లాప్‌తో కష్టాలు

    సినిమా ఫ్లాప్‌తో కష్టాలు

    ఆట పాట లపాట అనే సినిమా పరాజయాన్ని చవిచూడటంతో రాజ్‌పాల్ యాదవ్ నష్టాల్లో కూరుకుపోయాడు. దాంతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాడు. తీసుకొన్న అప్పును చెల్లించలేకపోవడంతో ఎంజీ అగర్వాల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రాజ్‌పాల్ పలుమార్లు సమన్లు అందుకొన్నాడు.

     మూడు నెలల జైలుశిక్ష

    మూడు నెలల జైలుశిక్ష

    విచారణ అనంతరం కోర్టు ఆదేశం మేరకు రూ.1.58 కోట్లు చెల్లించాడు. మిగితా మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని కోర్టుకు హామీ ఇచ్చాడు. కానీ మిగిలిన అప్పును తిరిగి చెల్లించలేకపోయాడు. దాంతో విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది.

    గతంలో కూడా జైలుశిక్ష

    గతంలో కూడా జైలుశిక్ష

    నటుడు రాజ్‌పాల్ యాదవ్‌ జైలుకు వెల్లడం మొదటిసారి కాదు. 2013లో తప్పుడు అఫిడవిట్‌ను సమర్పించిన రాజ్‌పాల్ యాదవ్‌కు కోర్టు జైలుశిక్ష విధించింది. దాంతో మూడు రోజులు తీహార్ జైలులో గడిపాడు. అనంతరం రాజ్‌పాల్ అభ్యర్థన మేరకు శిక్షను రద్దు చేసింది.

    English summary
    The Delhi High Court on Friday sentenced Bollywood actor Rajpal Yadav to three months of civil prison for failing to repay a loan of Rs 5 crore taken by his company to make a movie. Justice Rajiv Sahai Endlaw ordered that Yadav should be taken into custody and kept in the Tihar Jail.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X