షాకింగ్: రిషి కపూర్‌కు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు!
విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆకస్మిక మృతి సినీ లోకాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ విషాదం నుంచి కోలుకోక ముందే 80 దశకంలో లవర్ బాయ్ ఇమేజ్‌తో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన సీనియర్ నటుడు రిషీకపూర్ ఆస్పత్రి పాలయ్యారు. కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రిషి కపూర్ అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వయసు 67 సంవత్సరాలు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈ సీనియర్ నటుడికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తినట్టు తెలుస్తున్నది.

గతంలో క్యాన్సర్ వ్యాధి ట్రీట్మెంట్ కోసం న్యూయార్క్ కూడా వెళ్లారు. అయినప్పటికీ పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. ఇక రీసెంట్ గా మరోసారి కొంత అనారోగ్యానికి గురవ్వడంతో ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులు ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్పించారు.
రిషి కపూర్ సోదరుడు రణధీర్ కపూర్ తన అన్నయ్య ఆరోగ్య పరిస్థితిపై మీడియాకు క్లారిటీ ఇచ్చారు. రిషి కపూర్ ఆసుపత్రిలో ఉన్నారని చెబుతూ.. అన్నయ్య ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. క్యాన్సర్‌తో పాటు శ్వాస సమస్య కూడా ఉండడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పారు. ఇక వెంటిలేటర్ పై ఉన్నట్లు కొన్ని రూమర్స్ రావడంతో కపూర్ కుటుంబ సభ్యులు అలాంటి రూమర్స్ ని నమ్మవద్దని ఆయన త్వరలోనే కొలుకుంటారని తెలిపారు.


Click it and Unblock the Notifications











