22 ఏళ్ల అమ్మాయితో రెండో పెళ్లి.. 48 ఏళ్ల వయసులో షాకిచ్చిన స్టార్ హీరో
ఇటీవలి కాలంలో సినీతారల బ్రేకప్స్, విడాకులు, రెండో పెళ్లి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హీరో నాగచైతన్య .. శోభిత ధూళిపాళను ఇటీవలే రెండో పెళ్లి చేసుకుని జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టారు. ఇక బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ కూడా మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ మహిళతో ఆయన రిలేషన్‌లో ఉన్నారని.. త్వరలోనే ఆయన పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.
సినీతారల పెళ్లిళ్లలో ఏజ్ గ్యాప్ విషయం తరచుగా చర్చనీయాంశమవుతోంది. భర్త కంటే భార్య చిన్నది కావడం.. లేదంటే భార్య కంటే భర్త చిన్నవాడు కావడం వంటి ఉదంతాలు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో చూశాం. కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్, ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్, ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ తదితరులు ఇలాంటి వారిలో కొందరు. కానీ బాలీవుడ్ నటుడు , మోడల్ మిలిండ్ సోమన్ మాత్రం ఏకంగా తన కంటే వయసులో పాతికేళ్ల చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెతో హ్యాపీగా కాపురం కూడా చేసేస్తున్నాడు.

2018లో అంకితా కున్వర్‌ను మిలింద్ పెళ్లాడి షాకిచ్చారు. పెళ్లి సమయానికి ఆమె వయసు కేవలం 26 ఏళ్లే. ఎఫైర్లు, ప్రేమాయణాలతో వార్తల్లో నిలిచే సోమన్‌తో ఈమె ఎన్నాళ్లు కలిసుంటుందోనని అంతా భావించారు. కానీ పెళ్లయి దాదాపు ఆరేళ్లు గడుస్తున్నప్పటికీ ఈ జంట హ్యాపీగానే లైఫ్ లీడ్ చేస్తోంది. ఇక హాలీవుడ్ సూపర్‌స్టార్ లియోనార్డో డికాప్రియా 49 ఏళ్ల వయసులో 19 ఏళ్ల అమ్మాయితో డేటింగ్ చేస్తూ షాకిచ్చాడు.
తాజాగా బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ కూడా తన పెళ్లి వార్తలతో నిలిచాడు. 2001లో స్టైల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాహిల్ ఖాన్.. దాదాపు పాతికేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నప్పటకీ ఐదారు సినిమాలు మాత్రమే చేశాడు. నగర్ ఖాన్‌ను పెళ్లాడిన సాహిల్ ఏడాది తిరిగే సరికి ఆమెకు విడాకులు ఇచ్చాడు. నటి ఆయేషా ష్రాఫ్‌తో ప్రేమాయణం నడిపిన సాహిల్ పలు వివాదాల్లోనూ చిక్కుకున్నాడు. మహాదేవ్ బెట్టింగ్ యాప్‌లో ఆయనను అరెస్ట్ చేసేందుకు ముంబై పోలీసులు సినిమా తరహాలో దాదాపు 1800 కిలోమీటర్ల పాటు ఛేజ్ చేశారు.
బెలారస్‌కు చెందిన 22 ఏళ్ల మిలేనా అలెగ్జాండ్రాతో ప్రేమలో పడ్డ సాహిల్ ఖాన్ .. త్వరలోనే ఆమెను పెళ్లాడబోతున్నట్లు చెప్పాడు. అతని కోసం మిలేనా ఇస్లాంలోకి సైతం మారింది. తాజాగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో మిలేనాను పెళ్లాడిన సాహిల్ దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఎట్టకేలకు నేను నా బేబీని పెళ్లి చేసుకున్నాను అని సాహిల్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కొత్త జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











