చనిపోయినా సరే అలాంటి ట్రీట్మెంట్ వద్దని అనుకున్నా: సంజయ్ దత్ షాకింగ్ కామెంట్స్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అతను తన జీవితంలో ఊహించిన విధంగా ఎంతో స్టార్ ఇమేజ్ ను పొందడమే కాకుండా పలు వివాదాస్పద కేసులలో కూడా చిక్కుకోవాల్సి వచ్చింది.
సంజయ్ దత్ చాలా కాలం పాటు జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది. ఇక అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న సమయంలో అనుకోకుండా అతనికి క్యాన్సర్ ఉన్నట్లు కూడా బయటకు వచ్చింది. ఇక ఒక ట్రీట్మెంట్ గురించి చెప్పిన సంజయ్ దానికంటే చనిపోవడమే మేలు అని అన్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

అప్పుడు క్యాన్సర్
2020లో సంజయ్ దత్ కు లగ్స్ క్యాన్సర్ ఉన్నట్లు తెలియడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక కీమోథెరపీ ట్రీట్మెంట్ కోసం ఆయన చాలా కాలం పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆ విషయం గురించి సంజయ్ దత్ ఇటీవల ఒక వివరణ ఇచ్చాడు.
ప్రతిసారి కూడా నాకు వెన్నునొప్పి కలుగుతూ ఉండేది ఆ నొప్పి వచ్చినప్పుడు చికిత్స కోసం రెడీ కావాల్సి వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా వేడి నీటి సీసాతో అలాగే వివిధ రకాల ఔషధాలతో చికిత్స అందించేవారు అన్నారు.

ఇబ్బందిగా మారింది
క్యాన్సర్ కు గురించి తెలియనప్పుడు.. ఒకరోజు నాకు అనుకోకుండా గాలి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా మారిపోయింది. అప్పుడు హఠాత్తుగా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో నా భార్య మాన్యత నా వెంట లేదు. నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా నా దగ్గర లేరు. ఇప్పుడే ఓ యువ వైద్యుడు వచ్చి క్యాన్సర్ ఉంది అని చెప్పారు.. అని సంజయ్ అన్నారు.

చనిపోవడం బెటర్ అని అనుకున్నా
ఇక ఆ పరిస్థితి గురించి తెలిసిన తర్వాత కీమోతెరపి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అన్నారు. అయితే ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే కూడా చనిపోవడం బెటర్ అని అనుకున్నట్లుగా సంజయ్ దత్ చెప్పారు. ఎందుకంటే క్యాన్సర్ కు చికిత్స అనేది మనుషుల్ని బ్రతికిస్తుంది కానీ అది తీసుకోవడం అంత సులభమైన విషయం కాదు అని సంజయ్ చెప్పాడు.

ఆ ట్రీట్మెంట్ వద్దని
ఎందుకంటే మా ఫ్యామిలీలో కొంతమందిని క్యాన్సర్ మహమ్మారి మరణించేలా చేసింది. మా అమ్మగారు ప్యాంక్రియాటిక్ అనే క్యాన్సర్ తో చనిపోయారు. ఇక రీఛా శర్మ కూడా బ్రెయిన్ క్యాన్సర్ తోనే కన్ను మూసింది. అప్పుడు కూడా నాకు క్యాన్సర్ అని తెలియగానే కీబోథెరపీ మాత్రం తీసుకోకూడదు అని అనుకున్నాను. వాళ్ళు పడిన ఇబ్బందులు గుర్తొచ్చి చాలా కంగారు పడ్డాను.. అని సంజయ్ దత్ తెలిపారు.

నా వాళ్ళ కోసం ఆలోచించి
నా ప్రాణం పోయినా కూడా అటువైపు వెళ్ళకూడదు అని అనుకున్నాను. కానీ నా భార్య పిల్లలు అలాగే నా సోదరి అందరూ కూడా నాకు సపోర్ట్ గా నిలిచి వారి ప్రేమ కోసం నేను ఆ తర్వాత ఏదైనా సరి చేయడానికి సిద్ధమయ్యాను. ఇక కోలుకున్న తర్వాత KGF సెకండ్ పార్ట్ లో నేను పూర్తి చేయాల్సిన షూటింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది.. అని సంజయ్ దత్ వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











