షాకింగ్ న్యూస్: సంజయ్ దత్‌కు క్యాన్సర్.. ఇప్పుడు ఏ స్టేజిలో ఉందంటే?

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ ఇటీవల కొంత అస్వస్థతతో హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా మంగళవారం వచ్చిన రిపోర్ట్స్ లలో ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు తెలింది. విషయం తెలియగానే అందరు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. హాస్పిటల్ నుంచి సంజయ్ డిశ్చార్జ్ అయిన కొన్ని గంటలకే ఈ వార్త తెలియడంతో బాలీవుడ్ లో కూడా కొంత ఆందోళన మొదలైంది.

ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని

ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని

రెండు రోజుల క్రితం సంజయ్ దత్ కి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని ముంబై లీలావతి హాస్పిటల్ జాయిన్ అయిన విషయం తెలిసిందే. రూమర్స్ వైరల్ అవ్వకముందే తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సంజయ్ కూడా వివరణ ఇచ్చారు. అయితే కొన్ని గంటల క్రితమే సంజయ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యాడు.

క్యాన్సర్ భారిన పడిన సంజయ్

క్యాన్సర్ భారిన పడిన సంజయ్

అయితే రీసెంట్ గా వచ్చిన మరో రిపోర్ట్స్ లలో సంజయ్ దత్ కి క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ తో ఆయన బాధపడుతున్నట్లు ఆయన సన్నిహితులు ఒకరు బాలీవుడ్ మీడియాకు తెలియజేశారు. ఈ విషయం అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది.

సంజయ్ భార్య పిల్లలు దుబాయ్ లో..

సంజయ్ భార్య పిల్లలు దుబాయ్ లో..

ఇక ప్రస్తుతం సంజయ్ భార్య పిల్లలు కూడా దుబాయిలో ఉన్నట్లు సంజయ్ స్నేహితుడు తెలియజేశారు. ఇప్పుడు వారికి ఈ విషయాన్ని చెప్పడం ఒక అగ్ని పరీక్ష అని కూడా వారు మీడియాతో అన్నారు. ఇక వీలైనంత త్వరగా కోలుకుని మళ్ళీ రెగ్యులర్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని అనుకున్న సంజయ్ దత్ కి ఈ విధంగా క్యాన్సర్ భారిన పడటం కుటుంబ సభ్యులను బాధకు గురి చేస్తోంది.

Recommended Video

'Prasthanam' Hindi Remake Trailer Is Out Now || Filmibeat Telugu
చికిత్స కోసం అమెరికా..

చికిత్స కోసం అమెరికా..

ఇక చికిత్స కోసం సంజయ్ దత్ అమెరికా వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చాలా మంది స్టార్స్ అమెరికాలోనే క్యాన్సర్ కి చికిత్స తీసుకొని కొన్నాళ్లకు కొలుకున్నారు. ప్రస్తుతం సంజయ్ దత్ కి క్యాన్సర్ స్టేజ్ 3లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వయసు 61 సంవత్సరాలు. అయినా కూడా చికిత్స తీసుకుంటే క్యాన్సర్ ని జయించవచ్చని, ఆ అవకాశాలు మెండుగా ఉన్నాయని సంజయ్ సన్నిహితులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X