Shah Rukh Khan: ఎయిర్ పోర్ట్ లో షారుక్ ఖాన్ కు చేదు అనుభవం.. డబ్బు కట్టే వరకు వదల్లేదు!
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమార్ మరోసారి చేదు అనుభవం ఎదురయింది. అతనిని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అడ్డుకొని తనిఖీ చేయాల్సి వచ్చింది. చివరకు షారుక్ ఖాన్ చట్టపరంగా డబ్బులు కట్టే వరకు అక్కడ నుంచి కదలలేని పరిస్థితి ఏర్పడింది. బాలీవుడ్ అగ్ర హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న షారుక్ ఖాన్ అప్పుడప్పుడు పలు వివాదాలలో కూడా నిలుస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఆయనకు ముంబై ఏర్పాట్లు చేదు అనుభవం ఎదురయింది.
ఇటీవల షారుక్ ఖాన్ షార్జా లోని ఒక ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ ఈవెంట్ కు వెళ్లాడు. ప్రతిసారి షారుక్ ఖాన్ విదేశాలకు వెళ్ళినప్పుడు ఖరీదైన వస్తువులను తీసుకొస్తూ ఉంటాడు. ఇక దుబాయ్ లో కూడా అతనికి చాలామంది సన్నిహితులు ఉండడంతో ఎన్నో బహుమతులను కూడా వెంటబెట్టుకుని వస్తూ ఉంటాడు. దుబాయ్ లో షారుక్ ఖాన్ కు ప్రత్యేకంగా షాపింగ్ చేసే అలవాటు కూడా ఉంది. ఇక ఈసారి కూడా అతను దాదాపు 20 లక్షల వరకు షాపింగ్ చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే షారుక్ ఖాన్ దుబాయ్ నుంచి ముంబై ఏయిర్ పోర్ట్ కు రాగా కస్టమ్స్ అధికారులు షారుక్ తో పాటు అతని సిబ్బందిని కూడా తనిఖీ చేశారు. అయితే షారుక్ ఖాన్ దగ్గర దాదాపు 18 లక్షల విలువైన వాచీలు కనిపించాయి. అయితే వాటికి కస్టమ్స్ డ్యూటీ కింద షారుక్ ఖాన్ 6.83 లక్షల వరకు సుంకం కట్టాల్సి వచ్చింది. అలాగే కొన్ని ఫార్మాలిటీస్ ప్రకారం షారుఖాన్ తో అధికారులు చర్చించి అతని మేనేజర్ ని బయటకు వదిలినట్లు తెలుస్తోంది.
ఇక షారుక్ ఖాన్ బాడీగార్డ్స్ మాత్రం ఉదయం వరకు అధికారుల సమక్షంలోనే ఉంచినట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా షారుఖాన్ ఇదే తరహాలో కస్టమ్స్ డ్యూటీ కింద డబ్బు చెల్లించిన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. 2011లో విదేశాల నుంచి వచ్చినప్పుడు కొన్ని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడంతో వాటికి కస్టమ్స్ డ్యూటీ కింద దాదాపు 1.50 కోట్ల వరకు చెల్లించాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఆయన విమానాశ్రయం పట్టుబడ్డారు. అందుకు సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ప్రస్తుతం షారుక్ జవాన్, పటాన్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











