బాలీవుడ్ లో షాహిద్ కపూర్ రేంజ్.. నిర్మాతలు వామ్మో అంటున్నారుగా
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తెలుగు ప్రేక్షకులను మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఆయన నటనతో ఇక్కడ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. అయితే ప్రస్తుతం షాహిద్ కపూర్ క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా షాహిద్ కపూర్ నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ ఫర్జీ : సీజన్ 1తో OTT లో సంచలనంగా మారారు. ఇప్పుడు సీజన్ 2 షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ సందర్భంగా షాహిద్ కపూర్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ బాలీవుడ్లో చర్చగా మారింది.
షాహిద్ కపూర్ ఉత్తమ చిత్రాలు..
బాలీవుడ్ స్టార్ హీరోగా షాహిద్ కపూర్ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోల్లో ఈయన ఒకరు. 2003 నుంచి షాహిద్ కపూర్ హిందీ ఫిలిం ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో 20 ఏళ్ల సినీ అనుభవాన్ని పూర్తి చేసుకున్నారు. తొలుత డాన్సర్ గా పలు చిత్రాల్లో అవకాశాలు అందుకున్నారు. కాస్త ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడంతో ఇక హీరోగా ఇష్క్ విష్క్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పటివరకు 35 చిత్రాల్లో నటించి మెప్పించారు. అటు మ్యూజిక్ ఆల్బమ్స్ లోను తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో దుమ్ము లేపుతున్నారు.

బ్లాక్ బస్టర్ గా ఫర్జీ సీజన్ 1..
2023 ఫిబ్రవరి 10న ఫర్జీ సీజన్ వన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ వేదికన గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ జరిగింది. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ టెలివిజన్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, రెజీనా, కేకే మీనన్ కీలక పాత్రలో నటించారు. రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహించారు. డీ2ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై దర్శకులే నిర్మాతలుగా మారి భారీ బడ్జెట్ నిర్మించారు. మొదటి సీజన్లో 8 ఎపిసోడ్లను ప్రేక్షకులకు అందించారు. కౌంటర్ ఫిట్టింగ్, హవాలా, దొంగ నోట్ల ముద్రణ నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ క్రమంలో షాహిద్ కపూర్ మాఫియా లీడర్ తో సమస్యను కొని తెచ్చుకుంటాడు. ఇక తర్వాత ఏం జరిగిందనేది పార్ట్ 2కు వాయిదా పడింది.
ఫర్జీ: సీజన్ 2 ప్రారంభం..
ఫర్జి మొదటి భాగం సక్సెస్ కావడంతో ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు సీజన్ 2 ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా ఫర్జీ సీజన్ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. 2025 చివరి కల్లా షూటింగ్ను ప్రారంభించి త్వరలోనే పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. డిసెంబర్లో షూటింగ్ జరుగుతుందని బాలీవుడ్ మీడియా తెలుపుతుంది.
నిర్మాతలకు షాక్ ఇచ్చిన షాహిద్ కపూర్..
అయితే ఫర్జీ సీజన్ 2 కోసం షాహిద్ కపూర్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. సాధారణంగా సినిమాకు 25 నుంచి 30 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ తీసుకునే షాహిద్ కపూర్.. ఈ బ్లాక్ బస్టర్ టెలివిజన్ సిరీస్ కు 45 కోట్ల రూపాయల పారితోషికాన్ని చార్జ్ చేశారంట. ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్ ను 40 శాతం పెంచడంతో బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారాడు. ఇక షాహిద్ కపూర్ చివరిగా దేవా అనే చిత్రంలో నటించారు. పూజా హెగ్డే హీరోయిన్గా అలరించింది.


Click it and Unblock the Notifications











