దర్శకుడు రాఘవేంద్రరావుపై నోరుపారేసుకొన్న శ్రద్ధాకపూర్ తండ్రి.. ఏం జరిగిందంటే..

తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా హిందీ చిత్ర సీమలో తనదైన సత్తా చాటిన డైరెక్టర్లలో దర్శకుడు రాఘవేంద్రరావు ఒకరు. నాలుగు దశాబ్దాలకుపైగా సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించారు. శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన అతికొద్ది మంది దర్శకుల్లో ఒకరిగా ఆయన అరుదైన గుర్తింపు పొందారు. ఆయన రూపొందించిన చిత్రాలు కలెక్షన్ల పరంగా రికార్డులు తిరగరాశాయి. అయితే హిందీలో ఆయన రూపొందించిన తోఫా చిత్రం షూటింగ్ సందర్భంగా జరిగిన సంఘటనపై హీరోయిన్ శ్రద్దాకపూర్ తండ్రి శక్తికపూర్ స్పందించిన తీరు అభ్యంతరకరంగా మారింది. వివరాల్లోకి వెళితే..

దర్శకుడు రాఘవేంద్రరావు కెరీర్‌లో

దర్శకుడు రాఘవేంద్రరావు కెరీర్‌లో

దర్శకుడు రాఘవేంద్రరావు కెరీర్‌లో దేవత చిత్రం ప్రత్యేకమైనది. శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద, మోహన్ బాబు నటించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అప్పట్లో తెలుగులోనే రికార్డు కలెక్షన్లు సాధించింది. అయితే ఆ చిత్రం హిందీలో తోఫాగా ఆయన దర్శకత్వంలో రూపొందింది. ఆ సినిమాలో మోహన్ బాబు పోషించిన పాత్రను శక్తికపూర్ చేశారు.

దేవత చిత్రం హిందీలో ‘తోఫా’గా

దేవత చిత్రం హిందీలో ‘తోఫా’గా

ఇక తోఫా చిత్రంలోని పాత్ర శక్తికపూర్ జీవితాన్ని మలుపు తిప్పింది. విభిన్నమైన విలనిజంతో ఆయన ఆకట్టుకొన్నారు. శ్రీదేవిని లొలితా అంటూ చెప్పిన డైలాగ్ హిందీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అంతేకాకుండా ఆయన జీవితంలో ఆ డైలాగ్ ప్రత్యేకంగా నిలిచింది. శక్తికపూర్ పేరు చెప్పగానే ఆ డైలాగ్ గుర్తొచ్చేలా.. ఆ డైలాగ్ వినగానే శక్తికపూర్ గుర్తొచ్చేలా ప్రభావం చూపింది.

క్రేజీ డైలాగ్‌తో

క్రేజీ డైలాగ్‌తో


అయితే గతంలో హిందీలో విజయవంతంగా నడుస్తున్న ఓ కామెడీ షోలో శక్తికపూర్ పాల్గొన్నారు. ఆ సందర్బంగా లోలితా.. లలితా అనే డైలాగ్‌ మీకు మంచి గుర్తింపు తెచ్చింది కదా.. ఆ డైలాగ్ వెనుక ఏదైనా కథ ఉందా అనే ప్రశ్నకు శక్తికపూర్ సమాధానం ఇస్తూ.. దర్శకుడు రాఘవేంద్రరావుతో తనకు జరిగిన సుదీర్ఘమైన ఎపిసోడ్‌ను వినిపించారు.

రకరకాలుగా ప్రయత్నించినా..

రకరకాలుగా ప్రయత్నించినా..

తెలుగులో మోహన్ బాబు పోషించిన పాత్రకు నన్ను తీసుకొన్నారు. తెలుగులో ఆ డైలాగ్ పాపులర్. ఆ డైలాగ్‌ను కొత్తగా చెప్పించే విధంగా దర్శకుడు రాఘవేంద్రరావు ప్రయత్నించారు. నేను చెప్పిన పలురకాల డైలాగ్ ఆయనకు నచ్చలేదు. అలా చెప్పు.. ఇలా చెప్పు అంటూ మళ్లీ చెప్పించారు. నేను ఎలా చెప్పిన ఆయనకు నచ్చలేదు. అలా ఒక రోజు షూటింగ్‌లో సగం రోజు రీటేక్స్‌తోనే గడిచిపోయింది.

ఆ పాత్ర నుంచి అవుట్ అని...

ఆ పాత్ర నుంచి అవుట్ అని...

రాఘవేంద్రరావు తనకు నచ్చే విధంగా అదే డైలాగ్ పదే పదే చెప్పించడంతో నాకు ఒకరకమైన విసుగు వచ్చేసింది. ఇక ఈ సినిమాలో నాకు ఈ పాత్ర దక్కకపోవచ్చనే అభిప్రాయం కలిగింది. నన్ను ఇలా ఎందుకు వేధిస్తున్నారో అర్ధం కాలేదు అంటూ ఓ బూతు పదాన్ని వాడారు. లంచ్ బ్రేక్ తర్వాత నేను విసిగిపోయి ఒకరకమైన స్టయిల్‌లో చెప్పిన డైలాగ్‌కు రాఘవేంద్రరావు ఆశ్చర్యం వ్యక్తం చేసి ఎగిరి గంతేసినంత పని చేశారు.

Recommended Video

Irrfan Khan To Act Prabhas And Nag Ashwin's Movie But We Missed Him In Second Telugu Movie
ఆ డైలాగ్, ఆ పాత్ర నాకు ఇప్పటికీ..

ఆ డైలాగ్, ఆ పాత్ర నాకు ఇప్పటికీ..

అలా రాఘవేంద్రరావు విసిగించడం వల్ల నేను కోపంలో ఆ పదాన్ని విరిచినట్టు చెప్పడంతో ఆయనకు నచ్చింది. సినిమా రిలీజ్ తర్వాత నాకు ఆ పాత్ర, డైలాగ్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా రిలీజై చాలా ఏళ్లు అయినప్పటికీ.. ఇప్పటికీ ఆ డైలాగ్‌ను గుర్తుపెట్టుకోవడం నాకు సంతోషంగా ఉంటుంది అని శక్తికపూర్ అన్నారు. అయితే ఇప్పుడు శక్తి కపూర్ కూతురు శ్రద్ధాకపూర్ అనే విధంగా కాకుండా.. శ్రద్ధాకపూర్ తండ్రి శక్తికపూర్ అంటున్నారని ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X