20 ఏళ్ల యువతిని తుపాకి గురిపెట్టి రేప్.. బాలీవుడ్ హీరోయిన్ తండ్రిపై కేసు
బాలీవుడ్ నటి, మోడల్, సింగర్ షెహనాజ్ గిల్‌కు ప్రతిష్ట మంటగలిసే పరిస్థితి ఎదురైంది. ఆమె తండ్రి సంతోఖ్ సింగ్ రేప్ కేసులో ఇరుక్కుపోయారు. దాంతో హెహనాజ్‌కు దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఆ ఘటన ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. తండ్రి చేసిన పనికి షెహనాజ్ సినీ పరిశ్రమలో ఓ విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఇంతకు ఈ దారుణంలో అసలు ఏం జరిగిందంటే..

20 ఏళ్ల అమ్మాయికి తుపాకి గురిపెట్టి
నటి షెహనాజ్ గిల్ తండ్రి సంతోఖ్ అలియాస్ సుఖ పర్దాన్ జలంధర్ నివాసి. బాధితురాలి ఫిర్యాదుతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 20 ఏళ్ల అమ్మాయిని గన్‌తో బెదిరించి ఆమెపై పైశాచికత్వానికి పాల్పడ్డారు. మే 14 తేదీన దారుణ ఘటనపై ఫిర్యాదు చేయడానికి బాధిత కుటుంబం భయాందోళనకు లోనైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు అని పోలీసులు తెలిపారు.

ఫిర్యాదు చేయడానికి
పోలీసుల వెల్లడించిన ప్రకారం.. బాధితురాలి కుటుంబం భయంతో ముందుకు రాలేదు. దాంతో జలంధర్‌కు చెందిన ఓ వ్యక్తి బాధితురాలి చోరవ తీసుకొన్నారు. బాధితురాలు రష్మి (పేరు మార్పు) అందించిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. దాని ఆధారంగా ఘటనపై దర్యాప్తు చేపట్టాం. ఒకవేళ ఈ కేసుతో సంబంధముందని తేలితే సంతోఖ్ సింగ్‌పై తీవ్రమైన చర్యలు తీసుకొంటాం అని చెప్పారు.

బాధితురాలి కథనం..
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. మే 14వ తేదీన నా స్నేహితురాలితో కలిసి మరో స్నేహితుడు లక్కీ సిద్ధూను కలువడానికి బియాస్ గ్రామానికి వెళ్లాం. సుమారు 5.30 ప్రాంతంలో బియాస్ చేరుకొన్నాం. ఆ సమయంలో సంతోఖ్ సింగ్ వచ్చి తమపై తుపాకి గురిపెట్టి కారులోకి తోశాడు. ఆ తర్వాత చంపుతానని బెదిరించి తనపై లైంగిక దాడి చేశాడు అని చెప్పారు.

పోలీసులు తెలిపిన ప్రకారం..
రేప్ గురైన బాధితురాలు మానసికంగా, శారీరకంగా ఓ రకమైన క్షోభకు గురయ్యారు. ఈ ఘటన గురించి బయటకు చెప్పడానికి భయ పడ్డారు. ఆ తర్వాత స్నేహితుల సలహా, అండతో కేసు నమోదు చేయడానికి ముందుకొచ్చారు. అలా మే 19 తేదీన సుంతోఖ్‌పై బాధితురాలు ఫిర్యాదు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేసి సాక్ష్యాలను సేకరిస్తున్నాం. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం పంపాం అని పోలీసులు తెలిపారు.
Recommended Video

ఎవరినీ అరెస్ట్ చేయలేదు.. జిల్లా ఎస్పీ కథనం..
షెహనాజ్ గిల్ తండ్రిపై రేప్ కేసు నమోదైన విషయంలో అమృత్ సర్ జిల్లా ఎస్పీ విక్రమ్ జిత్ సింగ్ దుగ్గల్ స్పందిస్తూ.. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సంతోఖ్ సింగ్‌పై ఐపీసీ 376, 506 సెక్షన్ల ప్రకారం బియాస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాం. దర్యాప్తు వేగంగా కొనసాగుతున్నది. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు అని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











