నా కెరీర్ ను నాశనం చేశాడు.. టాప్ డైరెక్టర్ పై భగ్గుమన్న యాక్టర్
సినిమా అనే రంగుల ప్రపంచం లోకి చాలా మంది నటీనటులు ఎన్నో అసలు, ఎంతో తపనతో అడుగు పెడతారు. మరి అందులో వారు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది వారి కష్టం, అదృష్టం పై ఆధారపడి ఉంటుంది. అలాగే పలువురు నటీనటులకు ఆయా దర్శకుడకు లేదా ఈ టెక్నీషియన్ తో వర్క్ చేయాలి అని అలాంటి దర్శకుడు చేతిలో పడితే కదా మనకి కూడా గుర్తింపు వచ్చేది అని భావిస్తారు.
మరి అలా ఇండియా సినిమాలో ఉన్నటువంటి కొందరు విలక్షణ దర్శకుల్లో తమ సినిమాలతో మైమరపించే దర్శకులు బాలీవుడ్ సినిమా నుంచి కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇపుడు ఉన్న జెనరేషన్ కొందరి దర్శకుల్లా కాకుండా మన చరిత్రని బాజీరావు మస్తానీ, పద్మావత్ లాంటి ఎన్నో సినిమాలు చేసి ప్రస్తుత తరానికి చూపించే హిస్టారికల్ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ కూడా ఒకరు.

చరిత్ర పరంగా తీసే సినిమాల విషయాల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఏదొక కాంట్రవర్సీ రేపుతూ హాట్ టాపిక్ గా మారే తాను ఇటీవల టాప్ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో "హీరామండి" అనే ఒక హిస్టారికల్ వెబ్ సిరీస్ ని చేశారు. అయితే ఈ దర్శకుడు నా కెరీర్ మోసం చేసాడు అంటూ బి టౌన్ కి చెందిన ఓ ప్రముఖ నటుడు సంచలన కామెంట్స్ చేసాడు.
హిందీలో పలు టెలివిజన్ షోలు ఇంకా సినిమాలు మెయిన్ గా సెన్సేషనల్ హిట్ టీవీ షో సి ఐ డి లో కనిపించిన నటుడు రాజీవ్ ఖండేల్వాల్ సంజయ్ లీలా భన్సాలీపై సంచలన కామెంట్స్ చేసాడు. అది 2009 - 10 సంవత్సరంలో భన్సాలీ అమితాబ్ అలాగే విద్యా బాలన్ లతో "చెనాబ్ గాంధీ" అనే సినిమా చేసే ప్లాన్ చేసారని అందులో తనకి కూడా ఒక ముఖ్యమైన పాత్ర ఉంది అని సంజయ్ లీలా భన్సాలీ పిలిపించి లుక్ టెస్ట్ కూడా చేసి ఓకే చేసారని తెలిపాడు.

కానీ తర్వాత ఏమైందో తెలీదు అలా ఏడాది గడిచిపోయింది. నేనేమో సినిమా చేస్తున్నాను అని ఎన్నో అసలు పెట్టుకుని ఉన్నాను కానీ అసలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సినిమా ఆపేశారని వాపోయాడు. ఇలా తన కెరీర్ లో కీలక మలుపు అవుతుంది అనుకున్న సమయాన్ని సంజయ్ లీలా భన్సాలీ మోసం చేసి వేస్ట్ చేసారని రాజీవ్ ఖండేల్వాల్ ఆరోపించాడు.
దీనితో ఇలాంటి బిగ్ స్టార్ దర్శకుడు విషయంలో ఈ తరహా కోణం కూడా ఉందా అని బి టౌన్ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. కాగా ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ తన ఓటిటి సిరీస్ హీరామండి కి సీక్వెల్ ని తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సిరీస్ ఆడియెన్స్ లో సూపర్ రెస్పాన్స్ తెచుకోకపోయినప్పటికీ నెట్ ఫ్లిక్స్ లో భారీ రీచ్ ని అందుకుంది అందుకే దీనికి సీజన్ 2 కూడా చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











