twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి హీరో అనిపించుకున్న సోనూసూద్.. 173మంది పేదల కోసం స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్!

    |

    కరోనా సంక్షోభం మొదలైన తరువాత కొన్ని ఊహించని నిజాలు బయటపడుతున్నాయి. అలాగే నిజమైన మంచి తనం కూడా బయటపడుతోంది. లాక్ డౌన్ ముందు వరకు సోనూసూద్ అంటే వెండితెరపై కనిపించే ఒక విలన్ అని మాత్రమే అందరికి తెలుసు. కానీ కష్టాలు ఉన్నప్పుడు అతను సహాయం ఏ విధంగా చేస్తాడు అనేది లాక్ డౌన్ లోనే బయటపడింది. మరోసారి సోనూసూద్ పేద ప్రజలను స్వస్థలాలకు చేర్చేందుకు సొంత ఖర్చులతో చార్టెడ్ ఫ్లైట్ లను ఏర్పాటు చేశాడు.

    రియల్ హీరో..

    రియల్ హీరో..


    ఆకలి బాధలను తీర్చడం ఒక ఎత్తయితే.. సొంత ఊళ్లకు వెళ్లలేక లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు చేర్చడం మరొక ఎత్తు. బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ ఎవరు ఊహించని విధంగా తన సొంత ఖర్చులతో పేదలను సొంత గ్రామాలకు పంపే కార్యక్రమాన్ని చేపట్టాడు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను సొంత ఖర్చులతో చేసి మంచి మనసున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

    పేదల కోసం..

    పేదల కోసం..


    ముంబై పరిసర ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు రోడ్డు బాట పట్టిన పేదలను చూసి చాలా మంది సినీ తారలు స్పందించారు. కానీ ఎవరు సహాయం చేయలేదు. ప్రభుత్వాలు పట్టించుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు గాని ఒక్కరిని కూడా సొంత ఊళ్లకు పంపేందుకు ఏర్పాట్లు చేయలేదు. కానీ సోనూసూద్ మాత్రం ఎలాంటి ప్రచారాలు లేకుండా బస్సులను కేటాయించి కూలీలను సొంత ఊళ్లకు చేర్చాడు.

    చార్టెడ్ ఫ్లైట్..

    చార్టెడ్ ఫ్లైట్..

    ఇటీవల సోనూసూద్ కేరళలోనే ఉన్న 167 మంది కార్మికులను విమానంలో సొంత ఊళ్లకు పంపాడు. పనిలేక సతమతమైన కూలీలు సొంత ఇంటికి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారి కోసం సోనూసూద్ ఏకంగా చార్టెడ్ ఫ్లైట్ ని ఏర్పాటు చేయడం విశేషం. బస్సులతో పాటు విమానాల్లో అలాగే వివిధ రకాలుగా సోనూ సూద్ పేదలను స్వస్థలాలకు చేర్చుతున్నాడు.

    మరొసారి..

    మరొసారి..

    తన సమజాసేవకు ఈ స్టార్ యాక్టర్ ఏ మాత్రం ఎండ్ కార్డ్ పెట్టడం లేదు. మరోసారి ముంబై నుంచి డెహ్రాడూన్ కి 173 మంది వలసధారులను స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లో పంపించాడు. సొంత ఖర్చులతో పేదలను సొంత ఇళ్లకు పంపడానికి సోనూ సూద్ చేస్తున్న కృషికి మరోసారి నెటీజన్స్ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన హీరో అంటూ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

    English summary
    After the corona crisis began, some unexpected facts emerge. Also a real good story is coming out. Until the lockdown, everyone knew that Sonusood was a villain on the silver screen. But what he does to help when there is a hardship comes out of the lockdown. Once again, Sonu Sood set up chartered flights at his own expense to accommodate the poor people,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X