సహాయం చేయడానికి ఆస్తులు తాకట్టు పెడుతున్న సోనూసూద్.. వాటి విలువ ఎంతంటే..
సినిమా ఇండస్ట్రీలో విరాళాలు ప్రకటిస్తే ప్రచారాలు ఏ రేంజ్ లో చేసుకుంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే కొందరు మాత్రం ఎంత చేసినా కూడా ప్రచారాలు ఏ మాత్రం చేసుకోరు. ఇక అలాంటి అతికొద్ది మంది నటినటుల్లో సోనూసూద్ ఒకరు. లాక్ డౌన్ లో చాలా మంది జనాలకు ఆపద్బాంధవుడిగా ఎదురైన సోనూసూద్ ఇప్పటికి కూడా తన సహాయలను ఏ మాత్రం ఆపడం లేదు. ఇక ఇటీవల సోనూ సూద్ ఏకంగా ఆస్తులను తాకట్టుపెట్టినట్లు తెలుస్తోంది.

ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా
లాల్ డౌన్ లో వలసకూలీలు సొంత గూటికి చేరుకునే క్రమంలో రోడ్డు బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే వారికి అండగా ఉంటూ సహాయం చేసేందుకు సోనూ రవాణా సౌకర్యంతో పాటు తిండి వసతిని కూడా కల్పించాడు. ఇక ప్రాణాలు కొల్పయిన వారి కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేసిన సోనూసూద్ ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా అడిగిన వారికి సహాయం చేస్తున్నాడు.

ఆన్‌లైన్‌లోనే డబ్బులు పంపుతున్న సోనూ
ఇటీవల సోషల్ మీడియా ద్వారా కష్టాల గురించి తెలుసుకుంటున్న సోనూసూద్ ఆన్లైన్ లోనే డబ్బులు పంపుతున్నాడు. ఎవరు ఎలాంటి సహాయం అడిగినా కూడా తనవంతు సహాయం చేస్తున్నాడు. పేద రైతుల వివరాలు కూడా అడిగి తెలుసుకొని మరి వారికి అవసరమైన ట్రాక్టర్ లేదా ఏండ్లను కూడా కొనిస్తున్నాడు.

ఆస్తులు తాకట్టు పెడుతున్నాడట
అయితే సోనూసూద్ సహాయాల ప్రవాహం ఇప్పట్లో తగ్గేలా లేదు. తన బలం ఉన్నంత వరకు ఆ సహాయాలు కొనసాగుతూనే ఉంటాయని చాలా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు సోనూ సూద్. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సహాయలు చేసేందుకు సోనూసూద్ కొన్ని ఆస్తులను కూడా తాకట్టు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

వాటి విలువ ఎంతంటే..
ఇక ఇటీవల రూ.10 కోట్ల విరాళం పోగుచేయడానికోసమని తన ఎనిమిది ఆస్తుల్ని తాకట్టు పెట్టినట్లు సమాచారం. ముంబయిలోని జుహూలో ఉన్న రెండు దుకాణాలు, ఆరు ఫ్లాట్లకు సంబంధించిన అగ్రిమెంట్లపై సంతకం కూడా చేశారని సమాచారం. సెప్టెంబరు 15న, నవంబరు 24న రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని సమాచారం.
Recommended Video

స్పందించిన వెస్ట్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్
పేదల కోసం ఇలాంటి పని చేసిన వాళ్లను నేను ఇంత వరకు చూడలేదు అంటూ.. వెస్ట్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్ రితేష్ మెహతాజ్ సోనూసూద్ పై ప్రశంసలు కురిపించారు. నిజంగా సోనూ చేస్తున్న పని నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కూడా అన్నారు. ఇక హిందీ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో పలు సినిమాలబు చేయడానికి ఒప్పుకున్నాడు. రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











