సుశాంత్ డెత్ కేసులో మరో హీరోపై ఆరోపణలు.. కోపంతో పోలీస్ కంప్లైంట్!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక బాలీవుడ్ స్టార్స్ ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో ఇప్పటికే ముంబై పోలీసులు వందల సార్లు ఆరా తీశారు. సుశాంత్ మరణించి రెండు నేలలకు దగ్గరపడుతోంది. ముంబై పోలీసులతో పాటు బీహార్ పోలీసులు, ఈడీ అధికారులు, సీబీఐ విచారణ.. అంటూ సుశాంత్ కేసుపై అందరూ అధికారులు వారి స్టైల్ లో విచారణ జరుపుతున్నారు. ఇక ఇలాంటి సమయంలో బాలీవుడ్ యువ హీరో సూరజ్ పంచోలి ఈ కేసులో ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సూరజ్ పోలీసులను ఆశ్రయించాడు.

గతంలోనే మీడియాకు వార్నింగ్

గతంలోనే మీడియాకు వార్నింగ్

గతంలోనే ఒక ప్రముఖ మీడియాలో సూరజ్ పంచోలి దిశా సన్నిహితుడు అంటూ ఓక ఫోటోను పోస్ట్ చేయగా ఆ విషయం సీరియస్ గా తీసుకున్నారు. సూరజ్ సదరు మీడియా ఛానెల్ పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు ఎలా ప్రచారం చేస్తారని అంటూ అది పూర్తిగా అబద్ధమని మండిపడ్డారు.

 పోలీస్ స్టేషన్ లో పిర్యాదు

పోలీస్ స్టేషన్ లో పిర్యాదు

ఇక రీసెంట్ గా ఒక వెబ్ లింక్ లో కూడా సూరజ్ పంచోలికి సుశాంత్ కేసుకు ఒక సంబంధం ఉందనే కథనం రావడంతో సీరియస్ అయ్యాడు. ఈ విషయం అంత తేలిగ్గా తీసుకోకూడదని సూరజ్ వెంటనే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూరజ్ కంప్లైట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

అమ్మాయి ఎవరో కూడా తెలియదు..

అమ్మాయి ఎవరో కూడా తెలియదు..

సూరజ్ పంచోలి మొదటి నుంచి కూడా సుశాంత్ డెత్ కేసుపై సైలెంట్ గానే ఉన్నాడు. ఇక దిశా మరణం తరువాత సూరజ్ కి ఆమెకు సంబంధం ఉందని కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. అయితే తనకు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదని మీడియాలో చూపించిన ఫొటోలో ఉన్నది ఆమె కాదని కూడా సూరజ్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

Recommended Video

Sushant Singh Rajput: Netizens Demands Be Fair In Sushant Case| #BeFairInSSRCase
చట్టపరమైన చర్యలు తప్పవు

చట్టపరమైన చర్యలు తప్పవు


కొన్నిరోజుల క్రితమే సూరజ్ ఈ విషయంపై సదరు మీడియా ఛానెల్ కి వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తనపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇక రీసెంట్ గా సోషల్ మీడియాలో సుశాంత్ కేసులో సంబంధాలు ఉన్నాయని కథనాలు రావడంతో సూరజ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X