ఎంపీగా బరిలోకి బాలీవుడ్ హీరో సన్నీ డియోల్.. కోట్లలో ఆస్తుల ప్రకటన!

బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ బీజేపీ పార్టీ తరుపున గురుదాస్‌పూర్ లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయన నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా తన ఆస్తుల వివరాలను డిక్లేర్ చేస్తూ అఫిడవిట్ సమర్పించారు. మొత్తం రూ. 87.18 కోట్ల విలువగల ఆస్తులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు.

మొత్తం ఆస్తుల్లో చరాస్తులు రూ. 60.46 కోట్లు, స్థిరాస్తులు రూ. 21 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సన్నీ డియోల్ ప్రస్తుతం తన చేతిలో రూ. 26 లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు. భార్య లిండా డియోల్ వద్ద రూ. 16 లక్షలు క్యాష్ ఉన్నట్లు వెల్లడించారు.

బ్యాంక్ డిపాజిట్లు, వాహనాలు

బ్యాంక్ డిపాజిట్లు, వాహనాలు

తన చరాస్తుల్లో బ్యాంక్ డిపాజిట్లు రూ. 9.36 లక్షలు, ఇన్వెస్టిమెంట్లు రూ. 1.43 కోట్లు ఉన్నట్లు తెలిపారు. దాంతో పాటు రూ. 1.69 కోట్ల విలువగల వాహనాలు కలిగిన ఉన్నట్లు వెల్లడించారు. అయితే వాహనాల వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు.

వ్యవసాయ భూములు కూడా

వ్యవసాయ భూములు కూడా

21 కోట్ల విలువగల చరాస్థుల్లో వ్యవసాయభూమితో పాటు వ్యవసాయేతర భూమి, ముంబైలోని ఓషివరా కంప్లెక్సులో ఒక ఫ్లాట్ కలిగి ఉన్నట్లు తెలిపారు. తన భార్య వద్ద రూ. 1.56 కోట్ల విలువగల బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.

ఎడ్యుకేషన్ గురించి

ఎడ్యుకేషన్ గురించి

టోటల్ లియబిలిటీ రూ. 51.79 కోట్లు, అందులో ప్రభుత్వానికి రూ.2.49 కోట్ల(జిఎస్టి రూ. 1.07 కోట్లు) విలువ గల బకాయిలు ఉన్నట్లు వెల్లడించారు. తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి వెల్లడిస్తూ యూకె బర్మింగ్‌హామ్‌లోని ది ఓల్డ్ రెప్ థియేటర్ నుంచి యాక్టింగ్, థియేటర్ ఆర్ట్స్‌లో డిప్లమా పొందినట్లు వెల్లడించారు.

గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయం

గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయం

ముంబై విల్లే పార్లే‌లోని ధర్మేంద్రహౌస్‌ను తన అడ్రస్‌గా పేర్కొన్నారు. 2017-18 సంవత్సరంలో రూ. 63.82 లక్షలు, 2016-17 సంవత్సరంలో రూ. 96.29 లక్షలు, 2015-16 సంవత్సరంలో రూ. 2.25 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

కాంగ్రెస్ అభ్యర్థిపై పోటీ

కాంగ్రెస్ అభ్యర్థిపై పోటీ

బీజేపీ అభ్యర్థిగా గురుదాస్‌పూర్ లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సన్నీ డియోల్ అక్కడ సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ సునీల్ జఖర్‌తో తలపడబోతున్నారు. లోక్ సభ ఎన్నికలు 2019 ... 7వ దశలో భాగంగా మే 19న గురుదాస్‌పూర్లో పోలింగ్ జరుగబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X