Just In
- 10 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 11 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 12 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 13 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Automobiles
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నటుడు, ఎంపీ సన్నీడియోల్‌కు కరోనా పాజిటివ్.. వరుస దెబ్బలతో మనాలి నుంచి ముంబైకి..
బాలీవుడ్ హీరో, బీజేపీ ఎంపీ సన్నీడియోల్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయం స్పష్టమైంది. సన్నీకి కరోనా పాజిటివ్ అనే విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ హెల్త్ సెక్రెటరీ ధృవీకరించారు. ఆ వివారాల్లోకి వెళితే..

భుజానికి గాయంతో మనాలీ ఫామ్‌హౌజ్‌లో
భుజానికి గాయం కావడంతో కొద్ది రోజులుగా సన్నీడియోల్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటున్నారు. కుల్లు జిల్లాలోని మనాలీలోని తన ఫామ్ హౌజ్‌లో గాయం నుంచి ఉపశమనం పొందేందుకు చికిత్స తీసుకొంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన కరోనా బారిన పడ్డారు.

మనాలి నుంచి ముంబైకి
తనకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలగానే సన్నీ డియోల్ మనాలీ నుంచి వెంటే ముంబైకి వెళ్లిపోయారు. మెరుగైన చికిత్స కోసం ముంబైలోని ప్రముఖ హాస్పిటల్లో చేరారు అనే విషయాన్ని ఆయన సన్నిహితులు వెల్లడించారు.

స్వయంగా ట్విట్టర్ ద్వారా
తనకు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా సన్నీడియోల్ స్వయంగా వెల్లడించారు. నేను ఇటీవల కరోనావైరస్ టెస్టులు చేయించుకొన్నాను. నాకు పాజిటివ్ అనే విషయం పరీక్షల్లో బయటపడింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. కొద్ది రోజుల నుంచి ఎవరైనా నన్ను కలిస్తే వారు కూడా టెస్టులు చేయించుకోండి. దయచేసి గృహ నిర్బంధంలో ఉంటూ.. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి అంటూ సన్నిడియోల్ పేర్కొన్నారు.

సన్నీడియోల్ కెరీర్ గురించి
ఇక సన్నీడియోల్ కెరీర్ విషయానికి వస్తే.. దర్శకుడు అనిల్ శర్మ రూపొందించిన అప్నే చిత్రానికి సీక్వెల్‌తో సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో డియోల్ ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు వెండితెరపైన కనిపించబోతున్నారు. తండ్రి ధర్మేంద్ర, సోదరుడు బాబీ డియోల్, కుమారుడు కరణ్ డియోల్‌తో ఆయన కలిసి నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నది.