సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోస్ట్‌మార్టమ్ పూర్తి.. అంత్యక్రియలకు సిద్దమైన బంధువులు!
కరోనా వైరస్ తో సతమతమవుతున్న తరుణంలో ఒక్కసారిగా బాలీవుడ్ లో గ్యాప్ లేకుండా విషాద ఛాయలు అలుముకోవడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ధోని బయోపిక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వైద్య అధికారులు ఆయన పోస్టుమార్టం రిపోర్టును విడుదల చేశారు.

మెడకు గట్టిగా..
మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకుపోవడం వలనే సుశాంత్ ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. సుశాంత్ మృతదేహం ప్రస్తుతం జుహులోని కూపర్ ఆసుపత్రిలోనే ఉంది. మరణించిన వెంటనే పోలీసులు సుశాంత్ మృతదేహాన్ని ముంబైలోని జుహులోని కూపర్ హాస్పిటల్ కి తరలించారు.

అసలు కారణం
అనేక వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు సుశాంత్ మరణానికి గల అసలు కారణం ఉరి వేసుకోవడమే అని చెప్పారు. వంటి మీద మరో చోట గాయాలు లేవని ఎలాంటి విష ప్రయోగం జారగలేదని అన్నారు. అలాగే కోవిడ్ 19 పరీక్షలు కూడా నిర్వహించిన వైద్యులు నెగిటివ్ వచ్చిందని తెలిపారు.

నాలుగు గంటల పాటు
సుమారు నాలుగు గంటల పాటు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారని తెలుస్తోంది. ఇక పోలీసులు విభిన్న కోణాల్లో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి అసలు కారణాలు ఏమై ఉంటాయనే దానిపైన విచారిస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ లోనే సుశాంత్ సింగ్ మృతదేహం ఉంది. కొందరు బంధువులు కూడా సుశాంత్ బాడీని చూసినట్లు తెలుస్తోంది.
Recommended Video

అంత్యక్రియలు
ఇక నెక్స్ట్ అంత్యక్రియలు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్వస్థలంలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బీహార్ లోని పునియా అనే ప్రాంతంలో కుటుంబ సభ్యుల సమక్షంలోనే సుశాంత్ అంత్యక్రియలు జరగనున్నాయి. కాసేపట్లో సుశాంత్ మృతదేహానన్నీ సొంత గ్రామనికి అంబులెన్స్ లోనే తరలించనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











