సమంతను అలా చూసి చాలా భయపడ్డా.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. వరుస విజయాలను అందుకుంటూ సమంత స్టార్ హీరోయిన్ గా మారింది. అయితే.. అనారోగ్య సమస్యలతో ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ తరువాత బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఓరియంటెడ్ కంటెంట్ తో దూసుకుపోతుంది సమంత. రీసెంట్‌గా 'సిటాడెల్: హనీ బన్నీ'(Citadel: Honey Bunny)సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. సమంత ఆరోగ్య పరిస్థితిపై బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ స్టార్ హీరో ఎవరు? ఇంతకీ సమంతకు ఏమైంది? వివరాల్లోకెళ్తే..
హీరోయిన్ సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ జంటగా నటించిన 'సిటాడెల్: హనీ బన్నీ' అనే వెబ్ సిరీస్ గురువారం (నవంబర్ 7) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సిరీస్‌కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. హాలీవుడ్ నటుడు రిచర్డ్ మ్యాడెన్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన 'సిటాడెల్: హనీ బన్ని' వెబ్ సిరీస్‌కు ఇది ఇండియన్ సీక్వెల్ గా వచ్చింది. ఈ సీరిస్ లో సమంత లీడ్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో సమంత యాక్టింగ్‌కు ఫుల్ మార్కులే పడ్డాయి. సమంత నటనకు ప్రశంసలు అందుకుంది

ఈ సిరీస్ గురించి సమంత మాట్లాడుతూ.. తాను నటించిన క్యారెక్టర్ గురించి పలుమార్లు చెప్పుకొచ్చింది. తాను ఇలాంటి పాత్రలో నటించాలేదనీ, ఈ సిరీస్ లో నటించడం తాను ఛాలెంజ్ గా తీసుకున్నానన్నారు. తన కెరీర్‌లోనే బెస్ట్‌గా ఈ సీరిస్ నిలుస్తుందని సమంత అభిప్రాయపడ్డారు. సిరీస్ కోసం తాను చాలా కష్టపడినట్లు చెప్పుకొచ్చింది. అయితే.. సిరీస్ షూటింగ్ తాను మైయోసిటిస్‌తో బాధపడ్డాననీ, ఆ సమయంలో తనకు సహాయం చేసినా.. తనకు అండగా నిలిచిన వారికి తాను కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేనన్నారు.
తనని తాను నమ్మిన దానికంటే .. వాళ్లు తనని ఎక్కువగా నమ్మారనీ, వాళ్లు లేకుంటే.. తన ఆరోగ్యం సెట్ కావడానికి చాలా సమయం పడేదన్నారు. తాను తిరిగి పోరాడటానికి , తిరిగి సినిమాల్లో నటించడానికి చాలా సమయం పడ్డేదన్నారు. సరైన సమయంలో తనకు ప్రేరణ గా నిలిచారనీ సీరిస్ టీంపై ప్రశంసలు కురిపించారు సమంత.

ఇదెలా ఉంటే.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. తాను సిటాడెల్ షూటింగ్ చేస్తున్న సమయంలో సమంత పడిన కష్టాలను తాను చూశానన్నారు. సమంత ఆక్సిజన్ సిలిండర్ తోనే షూటింగ్ వచ్చేదనీ, షూటింగ్ లో సమయం దొరికినప్పుడల్లా ఆమె ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకునేదన్నారు. అనేక సందర్భాలలో ఆమె షూటింగ్ చేస్తున్నప్పుడు స్పృహ తప్పి కింద పడిపోయేదనీ, అయినా కూడా.. ఆమె ఇచ్చిన కమిట్మెంట్‌కి కట్టుబడి షూటింగ్‌ని పూర్తి చేసిందని ప్రశంసలు కురిపించారు హీరో వరుణ్ ధావన్.
ఇలాంటి వ్యక్తి తాను ఎప్పుడు చూడలేదనీ, ఒకసారి రైల్వే స్టేషన్‌లో షూటింగ్ సమయంలో ఆమె కుప్పకూలిపోయిందన్నారు. ఆ తరువాత కాస్త సెట్ అయ్యాక మళ్లీ షూటింగ్ లో పాల్గొందన్నారు. సమంత కేవలం ఆడవాళ్ళకు మాత్రమే కాదు, ఈ జనరేషన్ అందరికీ గొప్ప స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ సిరీస్ షూటింగ్ సమయంలో తాను ఆమెను చూసి చాలా నేర్చుకున్నానన్నారు. ఆమె నటనకు తాను ఫ్యాన్ అయిపోయానని వరుణ్ ధావన్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం హీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.సమంత ఇంత బాధపడిందా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు .


Click it and Unblock the Notifications











