విద్యాబాలన్ షూటింగులో మహిళపై లైంగిక వేధింపులు.. ప్రముఖ నటుడి అరెస్ట్

లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్ నటుడు విజయ్ రాజ్‌ను మధ్య ప్రదేశ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. షూటింగులో తనను లైంగికంగా వేధించారనే ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలోని గోండియాలో ఈ ఘటన జరిగింది. విజయ్ రాజ్‌పై కేసు రిజిస్టర్ చేశాం అని ఏసీపీ అతుల్ కులకర్ణి తెలిపారు.

పోలీసులు తెలిపిన ప్రకారం.. విజయ్ రాజ్‌పై షూటింగ్‌కు సంబంధించిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నది. దాంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం. ఆ తర్వాత విజయ్ రాజ్‌ను గోండ్యా కోర్టులో రాంనగర్ పోలీసులు హాజరుపరిచారు. ఆ తర్వాత బెయిల్ మంజూరు చేయడంతో విడుదల చేశాం అని పేర్కొన్నారు.

Bollywood Actor Vijay Raaz arrested on allegedly molesting a woman in Vidya Balan Sherni shoot

విద్యా బాలన్ నటిస్తున్న షేర్ని సినిమా షూటింగులో లైంగిక ఆరోపణలు రావడం గమనార్హం. ఈ సినిమా షూటింగులో తనను లైంగికంగా వేధించాడని యూనిట్లోని ఓ సభ్యురాలు ఆరోపణలు చేశారు.

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఇటీవల షేర్నీ షూటింగు ప్రారంభమైంది. కొద్ది రోజుల క్రితం విద్యాబాలన్ కూడా షూటింగులో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X