twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఒత్తిడులతో నలిగిపోయా.. యాక్టింగ్‌కు దంగల్ హీరోయిన్ గుడ్ బై

    |

    నేషనల్ అవార్డ్ విన్నర్, బాలీవుడ్ నటి జైరా వాసిం తాను సినిమాలకు స్వస్తి చెబుతున్నట్లు ఆదివారం తన ఫేస్ బుక్ పేజీ ద్వారా వెల్లడించారు. నా విశ్వాసాలు, మతానికి నేను చేస్తున్న వృత్తిని ముడి పెట్టి చూడటం వల్లే అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు 18 ఏళ్ల ఈ కాశ్మీరీ నటి తెలిపారు. ఈ మేరకు ఆమె సుధీర్ఘలేక సంధించారు.

    'దంగల్' మూవీ ద్వారా నటిగా కెరీర్ మొదలు పెట్టిన జైరా వాసిం... 'సీక్రెట్ సూపర్ స్టార్' మూవీలో ప్రధాన పాత్ర పోషించారు. 'నేను చిత్ర పరిశ్రమలో పర్ఫెక్టుగా ఫిట్ అయినప్పటికీ... నేను ఇక్కడ ఉండాల్సిన దాన్ని కాదు.' అని వ్యాఖ్యానించారు.

    ఆ నిర్ణయం నా జీవితాన్ని మార్చివేసింది

    ఆ నిర్ణయం నా జీవితాన్ని మార్చివేసింది

    ‘ఐదు సంవత్సరాల క్రితం నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. నేను బాలీవుడ్ చిత్ర సీమలో అడుగు పెట్టినపుడు మంచి గుర్తింపు, పాపులారిటీ వచ్చింది. ఎంతో మంది నన్ను ఆదరించారు. యువతకు రోల్ మోడల్‌గా పేర్కొన్నారు.'' అని జైరా వాసిం వ్యాఖ్యానించారు.

    చాలా కష్టపడ్డా, జీవనశైలి మార్చుకున్నాను

    చాలా కష్టపడ్డా, జీవనశైలి మార్చుకున్నాను

    చాలా రోజులుగా నేను మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని కష్టపడుతూనే ఉన్నాను. నా జీవనశైలిని మార్చుకుంటూ ముందుకు వెళ్లాను. ఈ క్రమంలో నేను ఓ విషయంలో రియలైజ్ అయ్యాను. ఇక్కడ నేను ఫిట్ అయినప్పటికీ, ఈ ఇండస్ట్రీలో ఉండాల్సిన వ్యక్తిని కాదు అని అర్థమైంది... అని జైరా వాసిం చెప్పుకొచ్చారు.

    ముస్లిం మతానికి చెందిన వ్యక్తిని కావడం వల్లేb

    ముస్లిం మతానికి చెందిన వ్యక్తిని కావడం వల్లేb

    నిజానికి ఈ పరిశ్రమ నాకు మద్దతు ఇవ్వడంతో పాటు ప్రేమను, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఈ క్రమంలో నేను కొన్ని ఊహించని పరిణామాలు కూడా ఎదుర్కొన్నాను. అదే ఈ ఇండస్ట్రీపై నమ్మకం కోల్పోయేలా చేసింది. ముస్లిం మతానికి చెందిన వ్యక్తిని కావడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు, బెదిరింపులు ఎదురొన్నట్లు... జైరా వాసిం తెలిపారు.

    అల్లాతో నా బంధం చెడిపోయేలా ఉంది

    అల్లాతో నా బంధం చెడిపోయేలా ఉంది

    నేను ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి బయట పడేందుకు ప్రయత్నించినప్పటికీ నా వల్ల కావడం లేదు. ఈ విషయంలో నేను పూర్తిగా ఓడిపోయాను. నాలోని ప్రశాంతతను, నా విశ్వాసాలను, అల్లాతో నా రిలేషన్ చెడిపోయే విధంగా ఉన్న ఈ వాతావరణంలో ఉండలేక పోతున్నాను. అందుకే నటనకు స్వస్థి చెప్పి బాలీవుడ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు జైరా వాసిం తెలిపారు.

    English summary
    Mumbai, June 30: National Award-winning actress Zaira Wasim, who rose to fame with her debut in Aamir Khan's film Dangal (2016) on Sunday in a surprising move, announced her 'disassociation' from the field of acting, saying she was not happy with the line of work citing that it interfered with her faith and religion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X