ఇంటిని అద్దెకిచ్చి సంపాదిస్తున్న స్టార్స్... ఎవరి ఇల్లు రెంట్ ఎంతంటే?
బాలీవుడ్ సెలబ్రిటీలు తమ లగ్జరీ ఫ్లాట్లను అద్దెకు ఇచ్చి లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నుండి సల్మాన్ ఖాన్ వరకు చాలామంది స్టార్స్ తమ ఇళ్లను అద్దెకు ఇస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ లిస్ట్ లో ఉన్న అందరికంటే అమితాబ్ ఎక్కువ సంపాదిస్తున్నాడు. మరి ఎవరెవరి ఇల్లు ఎంతకు అద్దెకిచ్చారు? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
సైఫ్ అలీ ఖాన్ కు ముంబైలోని బాంద్రాలో అపార్ట్‌మెంట్ ఉండగా, ఆయన దానిని అద్దెకు ఇచ్చారు. సైఫ్ ఈ అపార్ట్మెంట్ నుంచి అద్దెగా నెలకు రూ. 3.5 లక్షలు సంపాదిస్తున్నాడు. అయితే ఈ సంవత్సరం అతను అద్దె మరింత పెంచినట్టు సమాచారం.

అమితాబ్ బచ్చన్ కు ఒకటి కాదు చాలా ఇళ్లు ఉన్నాయి. వాటిలో ఒకటి డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్. దీన్ని కృతి సనన్ అద్దెకు తీసుకుంది. అమితాబ్ కు ఆమె ప్రతి నెలా దాదాపు 10 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తోంది.
రణబీర్ కపూర్ కు ముంబై, పూణెలో ఆస్తులను ఉన్నాయి. పూణెలోని ట్రంప్ టవర్‌లో ఉన్న ఫ్లాట్ ను ఇప్పటికే ఆయన అద్దెకు ఇచ్చారు. ఈ ఫ్లాట్ నుండి నెలకు అద్దె దాదాపు 4 లక్షల రూపాయలు వస్తున్నట్టు సమాచారం.
సల్మాన్ ఖాన్ కు కూడా బాంద్రాలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్ ఉంది. దీని ద్వారా సల్మాన్‌కు నెలకు దాదాపు 1.5 లక్షల అద్దె వస్తున్నట్టు సమాచారం. ఈ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంటే అడ్వాన్స్ గా రూ.4 నుంచి 5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

ప్రియాంక చోప్రాకు కూడా ముంబైలో చాలా ఆస్తులు ఉన్నాయి. పూణే సమీపంలో ఆమెకు ఒక విలాసవంతమైన బంగళా ఉంది. ఈ బంగ్లాను అద్దెకు ఇచ్చి ఆమె నెలకు రూ. 2 లక్షల రెంట్ వసూలు చేస్తోంది.
మలైకా అరోరా బాంద్రాలోని తన విలాసవంతమైన ఇంటిని ఇటీవలే అద్దెకు ఇచ్చింది. తన అపార్ట్‌మెంట్‌ను కాస్ట్యూమ్ డిజైనర్ కాశీష్ హన్స్‌కు మూడేళ్లపాటు అద్దెకు ఇచ్చారు. దీని నుంచి మలైకాకు ప్రతి నెల అద్దె రూ.1.57 లక్షలు అందుతోంది.


Click it and Unblock the Notifications











