Aishwarya Rai ఐశ్వర్య రాయ్, అభిషేక్ విడాకులు.. ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చేసిన జంట!
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ఒకరు. అయితే వీరి జంట గత కొన్నాళ్లుగా విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. వీరి మధ్య మనస్పర్థలు రావడంతోనే వీళ్లు విడిపోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ విడాకుల వార్తలపై ఇప్పటి వరకు ఈ జంట స్పందించలేదు. అయితే తాజాగా విడాకులపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు ఈ జంట. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
ప్రేమ పెళ్లి...:సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు అనేవి సర్వసాధరణం అయ్యాయి. హీరో హీరోయిన్లు, డైరెక్టర్ హీరోయిన్, ప్రోడ్యుసర్ హీరోయిన్ ఇలా చాలా మంది పెళ్లి చేసుకున్నారు. అయితే అందాల భామ ఐశ్వర్యరాయ్... బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరి పెళ్లి జరిగిన ఎన్నో ఏళ్లు అయింది. ఇక వీరికి ఓ కూతురు కూడా ఉంది. కూతురు ఆరాధ్య ఫోటోలు ఇటీవల నెట్టింట వైరల్ కూడా అయ్యాయి.

విడాకుల ప్రచారం...:అయితే ఈ మధ్య కాలంలో ఈ జంట విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రచారం పెద్దఎత్తున జరిగింది. బాలీవుడ్ మీడియాలో ఐశ్వర్య, అభిషేక్ విడాకులు అంటూ కోడై కూసింది. అయితే ఈ విడాకుల వార్తలపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు. అయినా వీరి విడాకుల ప్రచారం ఆగడం లేదు. తాజాగా ఒకే ఒక్క ఫొటోతో విడాకుల ప్రచారానికి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ చెక్ పెట్టారు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

హ్యాపీగా ఉండాలంటూ..:సోమవారం హోలీ పండుగ సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పలువురు వేడుకల్లో పాల్గొన్నారు. రంగులతో సంబరాలు చేసుకుని సందడి చేశారు. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా తన కుటుంబంతో హోలీ పండుగను సెలబ్రెట్ చేసుకుంది. ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఇంట్లో హోలీ జరుపుకుని.. సందడి చేశారు. ఈ సందర్భంగా ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన చాలా మంది 'అభిషేక్-ఐశ్వర్య ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చెక్ పెట్టిన జంట..:అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ విడాకుల గురించి గత సంవత్సరం నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇంకా కొందరికి అనుమానాలు ఇంకా ఉండగా... అలాంటి వారికి ఈ ఫోటోతో క్లారిటీ ఇచ్చింది ఈ జంట. హోలీ సందర్భంగా మంటలు వెలిగిస్తారనే విషయం తెలిసిందే. దీన్ని ఉత్తర భారతీయులు 'హోలికా దహన్' పేరుతో పిలుస్తారు. ఇక ఈ వేడుకను ఐశ్వర్య బచ్చన్ సెలబ్రెట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు.
ఐశ్వర్య అభిషేక్ బాగానే ఉన్నా.. కావాలని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారంటూ కొందరు కామెంట్ చేయగా.. వారికి ఈ పోస్టుతో నోరు మూయించారని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











