రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసిన అలియా భట్
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కతున్న 'ఆర్ఆర్ఆర్' మూవీలో హీరోయిన్లుగా నటించేది ఎవరు? అనే అంశం కొంతకాలంగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లనే తీసుకోవాలనుకుంటున్నారట.
ఈ నేపథ్యంలో ఇటీవల చిత్ర బృందం హీరోయిన్ అలియా భట్‌ను సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆమె డేట్స్ ఖాళీ లేక పోవడంతో 'ఆర్ఆర్ఆర్' ఆఫర్‌ను రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ 'సాహో' సినిమా కోసం కూడా అలియా భట్ కోసం ట్రై చేశారు.

ప్రస్తుతం అలియా భట్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె తన తాజా చిత్రం గల్లీబాయ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత సడక్ 2 షూటింగులో పాల్గొంటారు. అనంతరం 'తక్త్' చిత్రం చేయబోతున్నారు. దీంతో పాటు అశ్వినీ ఐయ్యర్ తివారితో ఓ సినిమాకు కమిటయ్యారట.
'ఆర్ఆర్ఆర్' సినిమా విషయానికొస్తే... రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ తప్ప ఇతర నటీనటులు ఎవరు? అనే విషయాలు బయటకు రివీల్ కాలేదు. ముఖ్యమైన పాత్ర కోసం అక్షయ్ కుమార్, అజయ్ దేవనగ్ లాంటి స్టార్లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారట.


Click it and Unblock the Notifications











