ఆ దర్శకుడి నిజస్వరూపం ఇదే .. వీడియోలు బయటిపెట్టిన స్టార్ హీరోయిన్

సినిమా తీయడానికి ముందు నటీనటులకు దర్శకుడు కథ , సన్నివేశాలు చెబుతారు. అయితే అది సినిమాగా మారే వరకు పలుమార్లు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటాయి. కొందరు నటీనటులు దర్శకుల విషయాల్లో కలగజేసుకోరు. కానీ కొందరు మాత్రం ప్రతి విషయంలోనూ వేలు పెట్టి అడ్డొస్తుంటారు. తాజాగా తనకు తొలుత ఓ కథ చెప్పి.. చివరిలో మొత్తం మార్చేసారని ఓ బాలీవుడ్ దర్శకుడిపై స్టార్ హీరోయిన్ మండిపడింది . ఈ వివరాల్లోకి వెళితే..

90లలో టాలీవుడ్, బాలీవుడ్‌లను ఒక ఊపారు అమీషా పటేల్. 50కి చేరువ అవుతున్నా ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో కుర్ర హీరోయిన్లను మించి మెరిసిపోతున్నారు. 9 జూన్ 1975న ముంబైలో పుట్టి పెరిగారు అమీషా పటేల్. ముంబైలో ప్రాథమిక విద్యను అభ్యసించగా అమెరికా బయో జెనెటిక్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. తొలుత ఎకనమిక్ అనలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. ఈ దశలో సినీ రంగం వైపు అడుగులు వేసిన అమీషా పటేల్.. 2000వ సంవత్సరంలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన కహో నా ప్యార్ హై సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పవన్ కళ్యాణ్ - పూరీ జగన్నాథ్‌ల కాంబోలో వచ్చిన బద్రీతో తెలుగు వారిని పలకరించారు .

Bollywood actress Ameesha Patel made sensational comments on gadar 2 director anil sharma

అలా తెలుగు, హిందీ ఇండస్ట్రీలను దశాబ్ధ కాలం పాటు అలరించిన అమీషా పటేల్ తర్వాత వయసు పైబడటం , కొత్త అందాల రాకతో వెనుకబడ్డారు. ఇలాంటి దశలో సన్నీడియోల్ సరసన గదర్ 2లో నటించారు అమీషా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే కొద్దిరోజుల క్రితం గదర్ 2 చిత్ర దర్శకుడు అనిల్ శర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమీషాపై కీలక వ్యాఖ్యలు చేశారు. అత్త పాత్రలో నటించడానికి అమీషా అంగీకరించలేదని .. ఆమె కంటే గొప్ప నటీనటులు చిన్న వయసులోనే చేశారని కామెంట్ చేశారు.

దీనిపై స్పందించిన అమీషా పటేల్ తనదైన శైలిలో కౌంటరిచ్చారు. ఏం చేయాలనేది నా ఇష్టమని .. 100 కోట్లు ఇచ్చినా అత్త లాంటి పాత్రలు చేయనని ఆమె తేల్చిచెప్పారు. తనకు తొలుత చెప్పినట్లు కాకుండా గదర్ 2 క్లైమాక్స్‌ను అనిల్ మార్చేశారని అమీష ఆరోపించారు. తన కుమారుడు ఉత్కర్ష్ శర్మ కోసమే అనిల్ ఆయన ఆ విధంగా చేశాడని ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో దుమారం రేపాయి. తాజాగా ఈ వ్యవహారంలో మరో బాంబు పేల్చారు అమీషా పటేల్.

గదర్ 2 స్టోరీ నరేషన్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇప్పుడు అనిల్ శర్మ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో విలన్‌ను నేనే చంపాల్సి ఉంటుందని తొలుత అనిల్ నాతో చెప్పారని.. కానీ షూటింగ్ సమయానికి అనిల్ శర్మ తన కుమారుడితో చంపే విధంగా నరేషన్ మార్చేశారని ఆరోపించారు అమీషా. లాస్ట్ మినిట్ వరకు ఈ విషయం తనకు తెలియదని ఆమె మండిపడ్డారు. తాజాగా అమీషా పటేల్ వ్యాఖ్యల నేపథ్యంలో అనిల్ శర్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: ameesha patel gadar 2 anil sharma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X