ఆ హీరోతో బ్రేకప్.. సర్వస్వం ఇచ్చి మోసపోయా, యంగ్ హీరోయిన్ సంచలనం
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ప్రేమాయణాలు, ఎఫైర్స్, బ్రేకప్స్ వార్తలే కనిపిస్తున్నాయి. తమన్నా - విజయ్ వర్మ బ్రేకప్‌తో ఉలిక్కిపడ్డ చిత్ర పరిశ్రమకు ధనశ్రీ వర్మ - చాహుల్ విడాకులు మరింత షాకిచ్చాయి. ఇన్నాళ్లు గుట్టుగా ఎఫైర్స్ నడిపిన కొందరు స్టార్స్ విడిపోతున్నారు. ఈ లిస్ట్‌లోకే వస్తారు బాలీవుడ్ ముద్దుగుమ్మ, లైగర్ ఫేమ్ అనన్య పాండే. ఇప్పటికే పలువురు స్టార్స్‌తో ప్రేమాయణం నడిపిన అనన్య తాజాగా మరో బాంబు పేల్చింది. ఈ వివరాల్లోకి వెళితే..
2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు అనన్య పాండే. ఆ తర్వాత పతి పత్ని ఔర్ ఓ, ఖాలీ, పిలీ, గెహరియన్, లైగర్, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ , డ్రీమ్ గర్ల్ 2, ఖో గయే హమ్ కహాన్, బ్యాడ్ నవాజ్, ఖేల్ ఖేల్ మైనే , సీటీఆర్ఎల్ తదితర చిత్రాలతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేసులో పరుగులు తీస్తున్నారు. అనన్య పాండే. చిత్ర పరిశ్రమలో ఎదగాలనే కసితో వచ్చిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ తొలినాళ్లలో ఎఫైర్స్‌కి దూరంగా ఉండేవారు. కానీ అన్ని సమయాల్లో పరిస్థితులు ఒకేలా ఉండవు కదా.

గ్లామర్ ఫీల్డ్, పైగా అట్రాక్షన్స్ కారణంగా అనన్య తన ఎఫైర్స్, బ్రేకప్స్‌తో వార్తల్లో నిలిచారు. బట్టలు మార్చుకున్నంత ఈజీగా బాయ్‌ఫ్రెండ్స్‌ని మార్చేస్తుందన్న అపవాదును మూటకట్టుకున్నారు అనన్య పాండే. తొలుత బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్‌తో ప్రేమలో పడింది. అతనితో దాదాపు మూడేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన అనన్య పాండే.. ఖట్టర్‌తో మూడు ముళ్లు వేయించుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. అనన్య - ఇషాన్‌ల బ్రేకప్ బాలీవుడ్‌ను కుదిపేసింది.
తర్వాత కొంతకాలం తన పని తాను చేసుకున్న అనన్య కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోయిన్‌గా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం లైగర్‌తో ఆమె తెలుగు వారిని పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయినప్పటికీ అనన్య తన అందాలు, క్యూట్ లుక్స్‌తో కుర్రకారుకి బాగానే కనెక్ట్ అయ్యారు. లైగర్ తర్వాత అనన్య పాండే ఏ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
కట్ చేస్తే.. ఇషాన్ ఖట్టర్‌తో బ్రేకప్ తర్వాత అనన్య మరో స్టార్‌తో ప్రేమలో పడ్డారు. అషికీ-2తో బాలీవుడ్‌ను షేక్ చేసిన ఆదిత్య రాయ్ కపూర్‌తో ఈమె డేటింగ్ చేశారు. కొంతకాలం పాటు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఆదిత్యతోనూ కటీఫ్ చెప్పేశారు అనన్య. ప్రస్తుతం అమెరికన్ మోడల్ వాకర్ బ్లాంకోతో రిలేషన్ స్టార్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. గతేడాది అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో వీరిద్దరూ కలిశారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆదిత్య రాయ్‌తో తన బ్రేకప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు అనన్య పాండే. రిలేషన్ సమయంలో తాను ఎంతో రాజీ పడ్డానని, కానీ చెడ్డవాళ్ల గురించి అంత మంచిగా ఉండాల్సిన అవసరం లేదన్నారు. బ్రేకప్ తర్వాత ఆదిత్య ఫోటోలను కాల్చేయడంతో బాధ తగ్గిందని.. రిలేషన్‌లో పూర్తిగా అర్పించుకున్నప్పుడే ఆ ప్రేమకు అర్ధం ఉంటుందని అనన్య పాండే అన్నారు. ఎదుటి వ్యక్తి నుంచి అలాంటిది ఆశించి నేను దెబ్బ తిన్నానని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











