‘రొమాంటిక్‌ మూవీస్ లో నటించాలనుంది’: బాలీవుడ్ హాట్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో రోజుకో కొత్త నటీ ఎంట్రీ ఇస్తోంది. ఇలాంటి పోటీ ప్రపంచంలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. అందం, అభినయమే కాదు. కాసింత అదృష్టం కూడా ఉండాలి. అలా ఆఫర్స్ వచ్చిన నటించిన మూవీ సక్సెస్ అయితేనే మూవీ హిట్ అవుతోంది. అయినా మేల్ డామినేషన్ ఉండే ఈ ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ కెరీర్ కొనసాగించాలంటే.. వచ్చిన ఏ ఆఫర్ అయినా కాదనొద్దు. ఈ విషయాన్ని గ్రహించిన ఓ బాలీవుడ్ హీరోయిన్.. తాను ఎలాంటి రోల్స్ చేయడానికైన సిద్ధమేనంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ బోల్డ్ కామెంట్స్ చేసిన బ్యూటీ ఎవరంటే?

ఆ హాట్ బ్యూటీ ఎవరో కాదు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లైగర్‌ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగు కుర్రకారును అట్రాక్ట్ చేసింది. తొలి మూవీ డిజాస్టర్ అయినా.. కోట్లాది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ మూవీ తరువాత తెలుగు తాను అనుకున్నట్లు ఆఫర్స్ రాకపోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2', 'డ్రీమ్‌గర్ల్‌ 2'లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గర అయింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో, హాట్ వెబ్ సీరిస్ ల్లో నటిస్తూ ఈ అమ్మడు బిజీగా గడుపుతోంది.

Bollywood Actress Ananya Pandey made interesting comments on romantic films

అనన్య నటించిన మూవీస్ చెప్పుకో తగ్గ విధంగా విజయం సాధించకున్నా.. ఈ బ్యూటీకి మాత్రం ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కాల్‌ మీ బె మూవీ పిచ్చ క్రేజ్ సంపాదించుకుంది అనన్య. తాజాగా 'కంట్రోల్‌'(CTRL)తో ప్రేక్షకులను మరో సారి ఎంటర్టైన్ చేస్తుంది. ఈ మూవీకి విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 4 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో విహాన్ సమత్ ప్రధాన పాత్రలో నటించారు. అంతకుముందు కాల్ మీ బే అనే వెబ్ సిరీస్ లో కూడా అనన్య పాండే, విహాన్ సమత్ వీరిద్దరు కలిసి నటించారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ హాట్ బ్యూటీ.

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే మాట్లాడుతూ.. తనకు బాలీవుడ్‌లో కొంతమంది దర్శకుల సినిమాల్లో నటించాలనుందని మనసులో కోరికను బయటపెట్టారు.
తనకు సంజయ్‌ లీలా భన్సాలీ తనకు ఇష్టమైన డైరెక్టర్ అనీ, ఆయన సినిమాల్లో చాన్స్ రావాలని కోరుకుంటున్నని అన్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో నుంచి ఇప్పటి వరకు ఎన్నో జానర్ సినిమాల్లో నటించాననీ, కానీ, రొమాంటిక్, హారర్, బయోపిక్‌లలో ఎక్కువగా నటించాలని ఉందని అనన్య అన్నారు. అలాగే కరణ్ జోహర్ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించాలని ఉందని తన కోరిక ఉందన్నారు అనన్య.

Bollywood Actress Ananya Pandey made interesting comments on romantic films

కరణ్ జోహర్ దర్శకత్వంలో వచ్చిన 'కాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ'లో కేవలం చిన్నపాత్రలో నటించే అవకాశం వచ్చిందనీ, కానీ, ఆయన సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం కోసం ఎదురుచూస్తుననీ తన మససులోని మాటను వెల్లబుచ్చింది. ఇక సోషల్‌ మీడియా గురించి మాట్లాడుతూ.. తాను చిన్నప్పుడు ఓ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశాననీ, ఆ విషయం తన తల్లికి తెలిసి దాన్నిడిలీట్ చేసిందనీ, 18 ఏళ్లు నిండిన తర్వాత మళ్లీ సోషల్‌ మీడియాలో అడుగుపెట్టానని, విరామ సమయంలో ఎక్కువగా సోషల్‌ మీడియాలో ఉంటాననీ, తనకు నచ్చిన సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటానని చెప్పారు అనన్య పాండే. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ టైంలో అనన్య చేసిన కామెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X